‘లాహే లాహే’ పాటకు ఏమన్నా డ్యాన్స్‌ వేశారా

గత కొంతకాలంగా టాలీవుడ్‌ మ్యూజిక్‌ లవర్స్‌ను ఓ ఊపు ఊపేస్తున్న పాట ‘లాహే లాహే…’. మెగాస్టార్‌ చిరంజీవి నటిస్తున్న‘ఆచార్య’ సినిమాలోని పాట అది. ఆ పాట ఎంత మధురంగా ఉంటుందో, అందులో చిరంజీవి వేసే స్టెప్పులు ఇంకా అద్భుతంగా ఉంటాయి. అందుకే ఆ పాట వ్యూస్‌ పరంగా యూట్యూబ్‌లో దూసుకుపోతోంది. మ్యూజిక్‌ ప్లాట్‌ఫార్మ్స్‌లో కూడా రిపీటెడ్‌ మోడ్‌లో యువత వింటోందట. ఇలాంటి పాటకు 60 ఏళ్ల వయసున్న బామ్మలు స్టెప్పులేస్తే.. అదిరిపోతుంది కదా.

ఓ టీవీ షో కోసం ‘లాహే లాహే..’ పాటకు 60 ఏళ్ల బామ్మలు ఆరుగురు స్టెప్పులేశారు. మామూలుగా రాజుసుందరం కొరియోగ్రఫీలు ఇలా పెద్ద వయసున్న మహిళలు కనిపిస్తుంటారు. అచ్చంగా అలాంటి వాళ్లే ఈ పాటకు టీవీ వేదికగా స్టెప్పులేశారు. కావాలంటే మీరూ దిగువ వీడియోలో చూసి చెప్పండి ఎంత బాగా డ్యాన్స్‌ చేశారో. ఆ గ్రేస్, స్టెప్పులు, ఎక్స్‌ప్రెషన్స్ అన్నీ అద్భుతం అనే చెప్పాలి. వారితో పాటు పాటలో బుల్లితెర నటుడు సుధీర్‌ కూడా కలిశాక, పాట ఇంకా అద్భుతంగా వచ్చింది.

డ్యాన్స్‌కు వయసు అడ్డు కాదని చాలా మంది చెబుతూనే ఉంటారు. అన్నట్లు ఈ విషయం మన సినిమా హీరోలు ఎప్పుడో నిరూపించేశారు అనుకోండి. అన్నట్లు మొన్నీమధ్య ఓ టీవీ షో కోసం రేఖ కూడా స్టేజీ మీద డ్యాన్స్‌ వేసింది. ఆమెకు కూడా 60+ అనే విషయం మీకు తెలిసిందే. ఇప్పుడు ఈ మహిళలు డ్యాన్స్‌ చేశారు. ఇలా చాలామంది ఉండే ఉంటారు. వాళ్ల స్ఫూర్తిగా మీరూ డ్యాన్స్‌ చేసి ఫిట్‌గా ఉండండి మరి.


ధూమపానం మానేసి ఫ్యాన్స్ ని ఇన్స్పైర్ చేసిన 10 మంది హీరోల లిస్ట్..!
ఈ 12 మంది హీరోయిన్లు తక్కువ వయసులోనే పెళ్లి చేసుకున్నారు..!
ఈ 12 మంది డైరెక్టర్లు మొదటి సినిమాతో కంటే కూడా రెండో సినిమాతోనే హిట్లు కొట్టారు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus