నేషనల్ అవార్డ్స్ గెలుచుకున్న సెలబ్రిటీలు వీళ్లే..!

  • October 25, 2021 / 06:19 PM IST

జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవం సోమవారం ఢిల్లీలో అట్టహాసంగా జరుగుతోంది. ఈ కార్యక్రమానికి పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. సినిమా రంగంలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన నటీనటులతో పాటు ప్రేక్షకుల మన్ననలు పొందిన చిత్రాలకు అవార్డులు అందజేశారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చేతుల మీదుగా పలువురు అవార్డులు అందుకున్నారు.

సూపర్ స్టార్ రజినీకాంత్ కు ‘దాదాసాహెబ్‌ ఫాల్కే’ అవార్డు లభించింది. గత నాలుగు దశాబ్దాలుగా సినీ పరిశ్రమకు ఆయన చేస్తోన్న సేవలు గుర్తించిన కేంద్రప్రభుత్వం ఈ ప్రతిష్టాత్మక అవార్డుతో ఆయన్ను గౌరవించింది.

విన్నర్స్ లిస్ట్..

ఉత్తమ చిత్రం: మరక్కర్ (మలయాళం)

ఉత్తమ నటుడు: మనోజ్‌ బాజ్‌పాయీ (భోంస్లే), ధనుష్‌ (అసురన్‌)

ఉత్తమ నటి : కంగనా రనౌత్‌ (మణికర్ణిక)

ఉత్తమ దర్శకుడు: సంజయ్‌ పూరన్‌ సింగ్‌ చౌహాన్‌ (బహత్తర్‌ హూరైన్‌)

ఉత్తమ తెలుగు చిత్రం: జెర్సీ

ఉత్తమ ఎడిటింగ్‌: నవీన్‌ నూలి (జెర్సీ)

ఉత్తమ వినోదాత్మక చిత్రం: మహర్షి

ఉత్తమ హిందీ చిత్రం: చిచ్చోరే

ఉత్తమ తమిళ చిత్రం: అసురన్‌

ఉత్తమ సహాయ నటి: పల్లవి జోషి(ది తాష్కెంట్‌ ఫైల్స్‌)

ఉత్తమ సహాయ నటుడు: విజయ్‌ సేతుపతి(సూపర్‌ డీలక్స్‌)

ఉత్తమ యాక్షన్‌ కొరియోగ్రఫీ: అవనే శ్రీమన్నారాయణ(కన్నడ)

ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్స్‌: మరక్కర్‌ (మలయాళం)

ఉత్తమ సంగీత దర్శకుడు (పాటలు): డి.ఇమ్మాన్‌ (విశ్వాసం)

ఉత్తమ సంగీత దర్శకుడు (నేపథ్య): ప్రబుద్ధ బెనర్జీ (జ్యేష్టపుత్రో)

ఉత్తమ మేకప్‌: రంజిత్‌ (హెలెన్‌)

ఉత్తమ గాయకుడు: బ్రి.ప్రాక్‌ (కేసరి చిత్రంలోని ‘తేరీ మిట్టీ…’)

ఉత్తమ గాయని: శావని రవీంద్ర (బర్దో-మరాఠీ)

ఉత్తమ కొరియోగ్రాఫర్‌: రాజు సుందరం (మహర్షి)

నాట్యం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

సంకల్ప బలమే ‘మురారి’ ని క్లాసిక్ చేసింది, 20 ఏళ్ళ ‘మురారి’ వెనుక అంత కథ నడిచిందా…!
ఫ్యాక్షన్ సినిమాకి సరికొత్త డెఫినిషన్ చెప్పిన కృష్ణవంశీ ‘అంతఃపురం’…!
టాలీవుడ్‌ టాప్‌ భామల రెమ్యూనరేషన్‌ ఎంతంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus