రవి వర్మకి మాత్రమే అంత అందం కనిపించిందా అనేలా..!

రాజా రవి వర్మ పెయింటింగ్స్ గురించి అందరికీ ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన పెయింటింగ్ ను వర్ణిస్తూ మనం కొన్ని పాటలను కూడా విన్నాం. ఇక తాజాగా ఆయన క్రేజీ హీరోయిన్లను కూడా ఆయన పెయింటింగ్ లోని అందమైన బొమ్మల్లా మార్చేశారు. వివరాల్లోకి వెళితే.. ఓ క్యాలెండర్ కోసం మన సమంత, శృతి హాసన్, ఐశ్వర్య రాజేష్, రమ్యకృష్ణ, మంచు లక్ష్మి, ఖష్భూ సుందర్‌ , స్వాతి రెడ్డి వంటి వారు రవి వర్మ పెయింటింగ్ లో భాగంగా పాల్గొన్నారు. నటి సుహాసిని ఆధ్వర్యంలో ఈ పెయింటింగ్ ప్రోగ్రాం జరిగింది.

ఇక ఇందులో భాగంగా మన భామలందరూ.. రవి వర్మ గారి పెయింటింగ్ లో బొమ్మల్లా మారిపోయారు. అసలు ఈ భామల్లో ఇంత అందం దాగుందా అని ఆశ్చర్య పడేలా ఈ పెయింటింగ్ లు ఉన్నాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ పెయింటింగ్ లు తెగ వైరల్ అవుతున్నాయి. రవి వర్మ గారిని ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. అచ్చమైన తెలుగు అందాలను.. మనకి మరోసారి పరిచయం చేసేలా ఉన్నాయి అంటూ ఎంతో మంది కామెంట్స్ చేస్తున్నారు.

నాగ చైతన్య తో వివాహం అయినప్పటికీ.. ఇప్పటికీ కథా ప్రాధాన్యత ఉండే చిత్రాలను చేస్తూ స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతున్న సమంత ఈ పెయింటింగ్ కార్యక్రమంలో భాగంగా చేతిలో ఓ నిమ్మపండుతో ఫోటోలకు పోజులిచ్చింది. ఎంతో చూడ చక్కగా అందరినీ ఆకర్షిస్తుంది మన అక్కినేని వారి ఇంటికోడలు.

కొంత కాలంగా సినిమాలకు దూరంగా ఉంటూ వస్తోన్న శృతి హాసన్ అయితే.. నిజంగా బొమ్మలానే ఉంది. ఈ ఫోటోలు చూస్తే ఈమె తిరిగి సినిమాల్లో అదే స్థాయిలో దూసుకుపోవడం ఖాయంగా కనిపిస్తుంది.

‘కౌసల్య కృష్ణమూర్తి’ ‘వరల్డ్ ఫేమస్ లవర్’ అంటూ తెలుగులో కూడా బిజీ అవుతున్న హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ లో కూడా ఇంత అందం దాగుందా అని ఆశ్చర్యపడేలా చేసింది.

‘బాహుబలి'(సిరీస్) తో దేశమంతా తన నట విశ్వరూపాన్ని చూపించిన శివగామి.. రమ్యకృష్ణ సైతం ఇంకా వన్నె తగ్గని అందంతో ఆకట్టుకుంది.

మోహన్ బాబు కుమార్తె మంచు లక్ష్మి కూడా ఈ పెయింటింగ్ కార్యక్రమంలో పాల్గొంది. ఈమె కూడా తెలుగుతనం ఉట్టిపడేలా ఫోజులిచ్చి ఆశ్చర్యపరిచింది.

ఇక అలనాటి బ్యూటీ కుష్బూ సుందర్ సైతం.. ఈ కార్యక్రమంలో పాల్గొని.. రాజమాత రేంజ్ లో కనిపించి ఆకట్టుకుంది.

కలర్స్ ప్రోగ్రాంతో మంచి క్రేజ్ దక్కించుకున్న స్వాతి రెడ్డి.. కొన్ని సినిమాల్లో హీరోయిన్ గా నటించి మరింత పాపులర్ అయ్యింది. ఈ మధ్యనే పెళ్ళిచేసుకుని సినిమాలకు దూరంగా ఉంటూ వస్తున్న ఈ బ్యూటీ సైతం.. రవివర్మ పెయింటింగ్ కార్యక్రమంలో పాల్గొంది. ఎంతో చక్కని ఫోజ్ ఇచ్చి ఈమె కూడా ఆకట్టుకుంది.

చెప్పాలంటే… రవివర్మ పెయింటింగ్ లోని అందాలను మ్యాచ్ చెయ్యాలని ఎంతో మంది అమ్మాయిలు ప్రయత్నిస్తూ.. వాటి కోసం ఎన్నో డైట్ లు .. ఎక్సర్సైజ్ లు చేస్తుంటారు. అన్ని చేసినా వారు నిజంగా సూట్ అవుతారో లేదో తెలీదు కానీ… ఈ బ్యూటీస్ మాత్రం పర్ఫెక్ట్ గా సూట్ అయ్యారు. మీరు కూడా ఈ ఫొటోలన్నింటినీ ఓ లుక్కెయ్యండి.

అల్లు అర్జున్ ఆస్తుల వివరాలు
ఎన్టీఆర్ ఆస్తుల వివరాలు

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus