సైన్స్ ఫిక్షన్ మూవీస్ కి అందులోనూ టైం ట్రావెల్ కాన్సెప్ట్ తో రూపొందిన మూవీస్ కి ఇప్పటికీ మంచి డిమాండ్ ఉంది. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే జోనర్ ఇది అని చెప్పాలి. పర్ఫెక్ట్ గా కనుక వస్తే ఇలాంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ఇదిలా ఉండగా.. ఈ వారం 10 కి పైగా సంఖ్యలో సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. అందులో 7 :11 PM అనే మూవీ ఒకటి.ఈ చిత్రం టీజర్, ట్రైలర్లు ఇంట్రెస్టింగ్ ఉన్నాయి. టాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ ‘మైత్రి మూవీ మేకర్స్’.. వారు ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తుండటంతో ప్రేక్షకుల ఫోకస్ ఈ చిత్రం పై పడింది. మరి ఈ సినిమా ప్రేక్షకుల్ని ఎంత వరకు ఆకట్టుకుందో తెలుసుకుందాం రండి :
కథ : హంసలదీవికి చెందిన రవి(సాహస్ పగడాల) చిన్నప్పుడే తల్లిదండ్రులను పోగొట్టుకుని తన బాబాయ్ దగ్గర పెరుగుతాడు. అలాగే ఓ పెద్దింటి అమ్మాయి విమల(దీపికా రెడ్డి) తో ప్రేమలో ఉంటాడు. మరోపక్క తన ఊరిలో ఉన్న బ్యాంకు యజమానులు.. జనాలు బ్యాంకులో దాచుకున్న డబ్బుతో పరారవ్వాలని స్కాములు వంటివి చేస్తుంటారు. ఈ సమయంలో రవి బాబాయ్, స్నేహితులు, అలాగే తన ప్రియురాలు విమల హత్యకు గురవుతారు.
ఈ విషయాలు తెలియకుండా రవి..హంసల దీవిలో సాయంత్రం 7 : 11 కి అదీ 1999 లో ఓ బస్ ఎక్కితే ..తర్వాతి రోజు 2024 వ సంవత్సరం ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ లో ఉంటాడు. ఆ టైంలో తన ప్రియురాలు, బాబాయ్, స్నేహితులు హత్యకు గురయ్యారని తెలుసుకుంటాడు. ఈ క్రమంలో మళ్ళీ 1999 కి వెళ్లి తన కథని మార్చుకోవాలి అనుకుంటాడు.అసలు తన బాబాయ్, ప్రియురాలిని హత్య చేసింది ఎవరు? రవి మళ్ళీ 1999 కి ఎలా వెళ్ళి తన కథని మార్చుకున్నాడు అనేది మిగిలిన కథ..!
నటీనటుల పనితీరు : రవి పాత్రలో సాహస్ పగడాల డీసెంట్ పెర్ఫార్మన్స్ ఇచ్చాడు. కొన్ని యాంగిల్స్ లో ఇతని లుక్స్ ‘కార్తీక దీపం’ లో డాక్టర్ బాబుని(నిరుపమ్) పోలి ఉంటాయి. విమలగా దీపికా రెడ్డి చేసింది ఏమీ లేవు. ఆమె లుక్స్ అయితే నేచురల్ గా ఉన్నాయి కానీ.. గ్లామర్ పరంగా, నటన పరంగా ఆమె మెప్పించలేకపోయింది. భరత్ రెడ్డి … తన మార్క్ సీరియస్ పెర్ఫార్మన్స్ తో ఆకట్టుకున్నాడు. రఘు కారుమంచి, రైజింగ్ రాజు కొన్ని చోట్ల నవ్వులు పూయించారు. మిగిలిన వారి పాత్రలు పెద్దగా గుర్తుండవు.
సాంకేతిక నిపుణుల పనితీరు : చైతు మాదాల డైరెక్టర్ గా ఎంట్రీ ఇవ్వడానికి మంచి జోనర్ ను ఎంపిక చేసుకున్నాడు. కానీ ఇలాంటి జోనర్ లో సినిమాలు చేయడం అంత ఈజీ అయితే కాదు. ప్రేక్షకుల మెదడుకి ఎక్కువ పని చెప్పకుండా సాంకేతిక విభాగం మెదడులకి ఎక్కువ పని చెప్పాలి. ప్రేక్షకులు లాజిక్స్ ను ఆలోచించకుండా థ్రిల్ అవ్వడమే పనిగా పెట్టుకోవాలి. వాళ్ళు లాజిక్స్ వెతికారు అంటే ..ఫలితం తేడా కొట్టినట్టే. 7 :11 PM విషయంలో అదే జరిగింది.
సినిమా ప్రారంభంలో హీరో తన తల్లిదండ్రులు హత్యకు గురైనట్లు చెబుతాడు. కానీ తర్వాత దానికి జస్టిఫికేషన్ అనేది ఇవ్వలేదు. ఫస్ట్ హాఫ్ ల్యాగ్ ఉంది. సెకండ్ హాఫ్ ఇంట్రెస్టింగ్ గా స్టార్ట్ అయ్యింది కానీ క్లైమాక్స్ మళ్ళీ ల్యాగ్ అనే ఫీలింగ్ ను కలిగించింది. శివ శంకర్ / ఫాబియో కాపోడివెంటో ల సినిమాటోగ్రఫీ సినిమా బడ్జెట్ కి తగినట్లుగా ఉంది అనుకోవాలి. జ్ఞాని నేపధ్య సంగీతం ఓకే.
విశ్లేషణ : సైన్స్ ఫిక్షన్, టైం ట్రావెల్.. కాన్సెప్ట్ మూవీస్ ని (7:11 PM) ఇష్టపడే వారికి సెకండ్ హాఫ్ పర్వాలేదు అనిపించొచ్చు. అది కూడా లాజిక్స్ వెతక్కుండా చూస్తే. అక్కడక్కడ కొన్ని కామెడీ సీన్స్ కూడా పర్వాలేదు అనిపిస్తాయి.టైం ట్రావెల్ సినిమా కథా అని భారీగా థ్రిల్స్ ఆశించి వెళ్తే నిరాశ తప్పదు.
రేటింగ్ : 2/5
Rating
2
Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus