Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #మిరాయ్ రివ్యూ & రేటింగ్
  • #కిష్కింధపురి రివ్యూ & రేటింగ్
  • #‘దృశ్యం 3’ మీరనుకున్నట్లు కాదు!

Filmy Focus » Featured Stories » చైతూ ప్రేమమ్ లో ఆకర్షించే అంశాలు

చైతూ ప్రేమమ్ లో ఆకర్షించే అంశాలు

  • October 6, 2016 / 02:08 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

చైతూ ప్రేమమ్ లో ఆకర్షించే అంశాలు

అక్కినేని కుటుంబానికి ప్రేమ కథలకు చాలా అనుబంధం ఉంది. ప్రేమ నగర్ సినిమాతో ఏఎన్ఆర్ ప్రేమకు పట్టాభిషేకం చేస్తే.. కింగ్ నాగార్జున టాలీవుడ్ మన్మధుడు గా పేరుగాంచారు. ఆ వంశానికి చెందిన నాగ చైతన్య ఒకే సినిమాలో మూడు ప్రేమకథలను మనకు పరిచయం చేయనున్నారు. చైతూ నటించిన అందమైన ప్రేమకథా చిత్రం ‘ప్రేమమ్’ రేపు (శుక్రవారం) విడుదల కానుంది. ఈ సందర్భంగా ఆ సినిమాలో ఆకర్షించే అంశాలపై స్పెషల్ ఫోకస్…

బ్లాక్ బస్టర్Premamమొదట మలయాళంలో రూపుదిద్దుకున్న “ప్రేమమ్” 2015 సంవత్సరంలో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. గత ఏడాది మల్లూవుడ్ లో అత్యధిక కలక్షన్లు వసూలు చేసిన చిత్రంగా రికార్డు సృష్టించింది. దాదాపు 60 కోట్లు వసూలు చేసి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఆ చిత్రాన్ని తెలుగులో నాగ చైతన్యతో రీమేక్ చేశారు. ఇక్కడ కూడా యువత ఈ ప్రేమ కథకు ఫిదా అయిపోవడం ఖాయం.

ఆసక్తికరమైన కథPremamఒక అబ్బాయి స్కూల్ దశలో పదవ తరగతి చదువుతుండగా తోటి విద్యార్థినిని ప్రేమిస్తాడు. చిరు ప్రాయంలో చిగురించిన ఆ ప్రేమ కొంతకాలమే ఉంటుంది. ఆ తర్వాత డిగ్రీ చదువుతుండగా అక్కడికి గెస్ట్ ఫ్యాకల్టీ గా వచ్చిన అమ్మాయిని ప్రేమిస్తాడు. ఆమెకి ప్రమాదం జరగడంతో గతం మరిచి పోతుంది. ఆ బాధ నుంచి కోలుకున్న ఆ అబ్బాయి జీవితంలో స్థిరపడుతున్న సమయంలో మరో అమ్మాయి అతని జీవితంలోకి వస్తుంది. ఇద్దరి ప్రేమించుకొని పెళ్లి పీఠలపై కూర్చుంటారు. మలయాళం ప్రేమమ్ కోసం ఆల్ఫోన్స్ పుథరిన్ రాసిన ఈ కథలో మార్పు లు చేయకుండా తెలుగు ప్రేమమ్ తెరకెక్కించారు. ఈ ఆసక్తికరమైన కథకు చైతూ తన ఫ్లేవర్ అద్దాడు.

లవర్ బాయ్ ఇమేజ్Premamనాగ చైతన్య “జోష్” అనే యాక్షన్ సినిమాతో అడుగుపెట్టినా “ఏమాయ చేసావే” చిత్రం తో యంగ్ ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యాడు. దీంతో లవర్ బాయ్ ఇమేజ్ సొంతం చేసుకున్నాడు. ఆ ఇమేజ్ ని 100 %లవ్ మూవీ అమాంతం పెంచింది. అప్పటినుంచి చైతూ ఫ్యాన్స్ పూర్తి లవ్ స్టోరీ ఫిల్మ్ కోసం చూస్తున్నారు. వారందరినీ ప్రేమమ్ సాటిస్ఫై చేస్తుందనడంలో సందేహం అవసరంలేదు.

తెర మీద రియల్ లైఫ్Premamప్రతి ఒక్కరి జీవితంలో కాలేజీ రోజులు మరిచిపోలేనివి. ఆ రోజుల్లో జరిగిన సంఘటనలు గుర్తు చేసుకుంటే మంచి అనుభూతినిస్తుంది. అమ్మాయికోసం తిన్న దెబ్బలైన, ప్రేమ కోసం పెట్టుకున్న గొడవలైనా మధురంగా ఉంటాయి. అలాంటి సన్నివేశాలతో నిర్మితమైందే ఈ ప్రేమమ్. ఇందులో సీన్లు చాలా నేచురల్ గా ఉండి అందరి హృదయాలను మీటుతాయి.

అందాల మయంPremamఈ చిత్రంలో నాగ చైతన్య సరసన ముగ్గురు హీరోయిన్లు నటిస్తున్నారు. మలయాళంలో అనుపమ పరమేశ్వరన్, మడొనా సెబాస్టియన్ పోషించిన పాత్రలనే తెలుగులోనూ చేస్తున్నారు. చిత్రంలో కీలకమయిన సాయి పల్లవి రోల్ లో శృతి హాసన్ కనిపించనుంది. ఈ ముగ్గురి భామల అందాలు మూవీని మరింత కలర్ ఫుల్ చేయనుంది.

చందు మొండేటి మ్యాజిక్Premamతొలి చిత్రం “కార్తికేయ”తో ఇండస్ట్రీ లోని ప్రముఖుల దృష్టిని ఆకర్షించిన చందు మొండేటి చేసిన సెకండ్ ప్రాజెక్ట్ “ప్రేమమ్”. కథలో మార్పు లేకుండా తన మార్కు స్క్రీన్ ప్లే, మాటలతో అలరించనున్నారు. ఈ సారి చందు తెరపైన ఎటువంటి మ్యాజిక్ చేసి ఉంటాడోనని అందరూ ఎదురుచూస్తున్నారు.

మధురమైన పాటలుPremamమలయాళం ప్రేమమ్ కి పాటలతో పాటు నేపథ్య సంగీతం ప్రాణం. కీలక సన్నివేశాల్లో తన సంగీతంతో రాజేష్ మురుగేషన్ కంటతడి పెట్టించారు. తెలుగు వెర్షన్ కి రాజేష్ మురుగేశన్ తో పాటు పి.సుందర్ జత కలిశారు. వీరిద్దరూ సంయుక్తంగా సంగీతం అందించారు. మళయాలం లోని మూడు బాణీలను యధావిధిగా తీసుకోగా .. మరో మూడు పాటలను పి.సుందర్ కంపోజ్ చేశారు. ఇవి యువత ఫేవెరెట్ సాంగ్స్ లిస్ట్ లో చేరిపోయాయి.

వెంకీ, నాగ్ స్పెషల్ అప్పీరియన్స్Premamఇందులో కింగ్ నాగార్జున, విక్టరీ వెంకటేష్ ప్రత్యేక పాత్రల్లో కనిపించనుండడం విశేషం. నాగార్జునతో చైతు ఇదివరకు కలిసి నటించాడు. మామయ్య వెంకటేష్ తో కలిసి చైతూ నటించడం ఇదే తొలిసారి. అక్కినేని నాగార్జున, విక్టరీ వెంకటేష్ ల స్టార్ ఇమేజ్ ఈ చిత్రానికి ప్లస్ కానుంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #8 Reasons To Watch Premam Movie
  • #Naga Chaitanya Movies
  • #naga chaitanya new movie
  • #Nagarjuna In Premam
  • #Premam Movie

Also Read

రజనీ కథతో 500వ సినిమా.. కట్ చేస్తే ‘పెదరాయుడు’ మ్యాజిక్ రిపీట్ కాలేదు

రజనీ కథతో 500వ సినిమా.. కట్ చేస్తే ‘పెదరాయుడు’ మ్యాజిక్ రిపీట్ కాలేదు

This Week Releases: ఈ వారం ఏకంగా 20 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 20 సినిమాలు విడుదల

Mirai Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘మిరాయ్’.. బయ్యర్స్ అంతా లాభాల్లో

Mirai Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘మిరాయ్’.. బయ్యర్స్ అంతా లాభాల్లో

Kishkindhapuri Collections: కిష్కింధపురి 3వ రోజు మొదటి రోజును మించి కలెక్ట్ చేసింది… కానీ

Kishkindhapuri Collections: కిష్కింధపురి 3వ రోజు మొదటి రోజును మించి కలెక్ట్ చేసింది… కానీ

సొంతవాళ్ళే చేతబడి చేశారు.. సీనియర్ హీరోయిన్ ఎమోషనల్ కామెంట్స్

సొంతవాళ్ళే చేతబడి చేశారు.. సీనియర్ హీరోయిన్ ఎమోషనల్ కామెంట్స్

Maruthi: ‘బార్బరిక్’ అంటే ‘బార్బిక్యూ’ లా అనిపించింది.. చెప్పుతో కొట్టుకుంటే బాధేసింది

Maruthi: ‘బార్బరిక్’ అంటే ‘బార్బిక్యూ’ లా అనిపించింది.. చెప్పుతో కొట్టుకుంటే బాధేసింది

related news

పెళ్ళైనా.. తల్లైనా.. తగ్గేదే లే అంటున్న 10 మంది స్టార్ హీరోయిన్లు

పెళ్ళైనా.. తల్లైనా.. తగ్గేదే లే అంటున్న 10 మంది స్టార్ హీరోయిన్లు

Bigg Boss 9: ‘బిగ్ బాస్ 9’ లో ఎంట్రీ ఇచ్చిన 15 మంది కంటెస్టెంట్స్ గురించి ఆసక్తికర విషయాలు

Bigg Boss 9: ‘బిగ్ బాస్ 9’ లో ఎంట్రీ ఇచ్చిన 15 మంది కంటెస్టెంట్స్ గురించి ఆసక్తికర విషయాలు

పోసాని టు జగదీష్.. కాంట్రోవర్సీల కారణంగా కెరీర్లో వెనుకబడ్డ 10 మంది నటీనటులు

పోసాని టు జగదీష్.. కాంట్రోవర్సీల కారణంగా కెరీర్లో వెనుకబడ్డ 10 మంది నటీనటులు

Nagarjuna Birthday Special: కింగ్‌.. మన్మథుడు.. బాస్‌.. బిరుదు ఏదైనా ఆయనకు యాప్ట్‌.. ఎందుకంటే?

Nagarjuna Birthday Special: కింగ్‌.. మన్మథుడు.. బాస్‌.. బిరుదు ఏదైనా ఆయనకు యాప్ట్‌.. ఎందుకంటే?

trending news

రజనీ కథతో 500వ సినిమా.. కట్ చేస్తే ‘పెదరాయుడు’ మ్యాజిక్ రిపీట్ కాలేదు

రజనీ కథతో 500వ సినిమా.. కట్ చేస్తే ‘పెదరాయుడు’ మ్యాజిక్ రిపీట్ కాలేదు

5 hours ago
This Week Releases: ఈ వారం ఏకంగా 20 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 20 సినిమాలు విడుదల

6 hours ago
Mirai Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘మిరాయ్’.. బయ్యర్స్ అంతా లాభాల్లో

Mirai Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘మిరాయ్’.. బయ్యర్స్ అంతా లాభాల్లో

9 hours ago
Kishkindhapuri Collections: కిష్కింధపురి 3వ రోజు మొదటి రోజును మించి కలెక్ట్ చేసింది… కానీ

Kishkindhapuri Collections: కిష్కింధపురి 3వ రోజు మొదటి రోజును మించి కలెక్ట్ చేసింది… కానీ

9 hours ago
సొంతవాళ్ళే చేతబడి చేశారు.. సీనియర్ హీరోయిన్ ఎమోషనల్ కామెంట్స్

సొంతవాళ్ళే చేతబడి చేశారు.. సీనియర్ హీరోయిన్ ఎమోషనల్ కామెంట్స్

10 hours ago

latest news

Rajinikanth: ఇళయరాజా.. ఓ అర బీరు.. ఆసక్తికర విషయాలు చెప్పిన రజనీకాంత్‌

Rajinikanth: ఇళయరాజా.. ఓ అర బీరు.. ఆసక్తికర విషయాలు చెప్పిన రజనీకాంత్‌

10 hours ago
Sai Dharam Tej: ఇల్లు, స్కూల్‌లో ఇవీ చెప్పండి.. సాయితేజ్‌ సూచనలు.. దేని గురించంటే!

Sai Dharam Tej: ఇల్లు, స్కూల్‌లో ఇవీ చెప్పండి.. సాయితేజ్‌ సూచనలు.. దేని గురించంటే!

10 hours ago
హీరోయిన్‌ నెంబర్‌ 3.. ‘ఓజీ’ కాస్టింగ్‌లో మరో హీరోయిన్‌

హీరోయిన్‌ నెంబర్‌ 3.. ‘ఓజీ’ కాస్టింగ్‌లో మరో హీరోయిన్‌

10 hours ago
Rajamouli: ఆర్‌ఎఫ్‌సీకి మళ్లీ వచ్చిన రాజమౌళి.. లీకుల బాధ తప్పించుకోడానికేనా?

Rajamouli: ఆర్‌ఎఫ్‌సీకి మళ్లీ వచ్చిన రాజమౌళి.. లీకుల బాధ తప్పించుకోడానికేనా?

10 hours ago
చిరంజీవి సమర్పించిన ఆ డిజాస్టర్‌పై రియాక్టైన స్టార్‌ హీరో.. 200 కోట్లు నష్టమంటూ..

చిరంజీవి సమర్పించిన ఆ డిజాస్టర్‌పై రియాక్టైన స్టార్‌ హీరో.. 200 కోట్లు నష్టమంటూ..

10 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version