Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Focus » Sree Vishnu: శ్రీవిష్ణుతో పాటు… ఒకే రోజు 2 సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన హీరోల లిస్ట్

Sree Vishnu: శ్రీవిష్ణుతో పాటు… ఒకే రోజు 2 సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన హీరోల లిస్ట్

  • February 14, 2026 / 03:11 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sree Vishnu: శ్రీవిష్ణుతో పాటు… ఒకే రోజు 2 సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన హీరోల లిస్ట్

శ్రీవిష్ణు(Sree Vishnu) హీరోగా తెరకెక్కుతున్న కొత్త సినిమాలు ‘మృత్యుంజయ్’ ‘విష్ణు విన్యాసం’ సినిమాలు ఒకే రోజున అంటే ఫిబ్రవరి 27నే రిలీజ్ అవుతున్నాయనే టాక్ నడిచింది.

శ్రీవిష్ణు కూడా ఈ విషయం పై స్పందించాడు. కానీ ఇబ్బంది ఎదురవ్వకుండా చర్చలు జరుపుతున్నట్టు కూడా తెలిపాడు.మొత్తానికి ‘మృత్యుంజయ్’ సినిమాని ఫిబ్రవరి 27 న, ‘విష్ణు విన్యాసం’ సినిమాని ఫిబ్రవరి 28న రిలీజ్ చేయబోతున్నారు.

Sree Vishnu

ఇక్కడ ‘మృత్యుంజయ్’ సినిమా రిలీజ్ రోజున అంటే ఫిబ్రవరి 27నే ‘విష్ణు విన్యాసం’ ప్రీమియర్ షోలు వేయబోతున్నట్టు టాక్ నడుస్తున్నాయి.అంటే ఫైనల్ గా ఆల్మోస్ట్ ఒకే రోజున 2 సినిమాలు రిలీజ్ అవుతున్నట్టే అనుకోవాలి.

శ్రీవిష్ణు మాత్రమే కాదు గతంలో కూడా కొంతమంది హీరోలకి ఇలాంటి అనుభవాలు ఎదురైన సందర్భాలు ఉన్నాయి. వాళ్ళు ఎవరో? ఒకే రోజు రిలీజ్ అయిన ఆ హీరోల సినిమాలు ఏంటో ఓ లుక్కేద్దాం రండి :

1) నందమూరి తారక రామారావు(సీనియర్ ఎన్టీఆర్) : విశ్వ విఖ్యాత, నట సార్వభౌమ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి సినీ కెరీర్ ను గమనిస్తే.. 1961 మే 5న ఇలాంటి సందర్భం చోటు చేసుకుంది. ఆయన హీరోగా నటించిన ‘పెండ్లి పిలుపు’ ‘సతీసులోచన’ వంటి సినిమాలు అదే రోజున రిలీజ్ అయ్యాయి. ‘పెండ్లి పిలుపు’ చిత్రాన్ని ఏ.వి.శేషగిరి రావు డైరెక్ట్ చేశారు. ఇక ‘సతీసులోచన’ చిత్రాన్ని ఎస్.రజినీకాంత్ డైరెక్ట్ చేశారు.

2) ఘట్టమనేని కృష్ణ : సూపర్ స్టార్ కృష్ణ కెరీర్లో కూడా ఇలాంటి అరుదైన సంఘటన ఒకటి చోటు చేసుకుంది. ఆయన అసాధారణ సినీ జర్నీని గమనిస్తే..1984 జనవరి 14న అంటే సంక్రాంతి కానుకగా.. ఆయన నటించిన ‘ఇద్దరు దొంగలు’ ‘యుద్ధం’ సినిమాలు ఒకే రోజున రిలీజ్ అయ్యాయి. విచిత్రం ఏంటంటే.. ఇవి రెండు మల్టీస్టారర్ సినిమాలే. ‘ఇద్దరు దొంగలు’ సినిమాని కె.రాఘవేంద్ర రావు డైరెక్ట్ చేశారు. ఇందులో కృష్ణతో పాటు శోభన్ బాబు మరో హీరోగా నటించారు. ఇక ‘యుద్ధం’ సినిమాని దాసరి నారాయణ రావు డైరెక్ట్ చేశారు. ఇందులో కృష్ణతో పాటు కృష్ణంరాజు మరో హీరోగా నటించారు.

3) చిరంజీవి : మెగాస్టార్ చిరంజీవి సినీ కెరీర్లో కూడా ఇలాంటి అరుదైన సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఒకసారి కాదు 2 సార్లు చోటు చేసుకోవడం విశేషంగా చెప్పుకోవాలి.

1980 సెప్టెంబర్ 19న చూసుకుంటే ఆయన నటించిన ‘కాళి’ ‘తాతయ్య ప్రేమలీలలు’ సినిమాలు ఒకే రోజున రిలీజ్ అయ్యాయి.’కాళి’ సినిమాని ఐ.వి. శశి దర్శకత్వం వహించగా ఇందులో చిరుతో పాటు రజనీకాంత్ మరో హీరోగా నటించారు. ఇక ‘తాతయ్య ప్రేమలీలలు’ సినిమాని బి.వి.ప్రసాద్ దర్శకత్వం వహించారు.

1982 లో చూసుకుంటే అక్టోబర్ 1న చిరంజీవి నటించిన ‘పట్నం వచ్చిన పతివ్రతలు’ ‘టింగురంగడు’ సినిమాలు ఒకే రోజున రిలీజ్ అయ్యాయి. ‘పట్నం వచ్చిన పతివ్రతలు’ సినిమాని టి.ఎస్.బి.కె మౌళి డైరెక్ట్ చేయగా.. ఇందులో చిరంజీవితో పాటు మోహన్ బాబు మరో హీరోగా నటించారు. ఇక ‘టింగురంగడు’ సినిమాని టి.ఎల్.వి ప్రసాద్ డైరెక్ట్ చేశారు.

4)నందమూరి బాలకృష్ణ : అవును మన బాలయ్య కెరీర్లో కూడా ఇలాంటి ఊహించని సందర్భం ఒకటి చోటు చేసుకుంది. 1993 సెప్టెంబర్ 3న ఆయన నటించిన ‘బంగారు బుల్లోడు’ ‘నిప్పురవ్వ’ వంటి సినిమాలు ఒకే రోజున రిలీజ్ అయ్యాయి. ‘బంగారు బుల్లోడు’ సినిమాని రవిరాజా పినిశెట్టి డైరెక్ట్ చేయగా, ‘నిప్పురవ్వ’ సినిమాని ఏ.కోదండరామిరెడ్డి డైరెక్ట్ చేశారు.

5) శ్రీకాంత్ : సీనియర్ హీరో శ్రీకాంత్ కెరీర్లో కూడా ఇలాంటి ఊహించని సంఘటన చోటు చేసుకుంది. 2000వ సంవత్సరంలో చూసుకుంటే డిసెంబర్ 21న శ్రీకాంత్ హీరోగా నటించిన ‘సకుటుంబ సపరివార సమేతంగా’, అలాగే ‘తిరుమల తిరుపతి వెంకటేశ’ సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఫ్యామిలీ ఆడియన్స్‌లో ఆయనకున్న క్రేజ్ వల్ల ఆ రిస్క్ చేశారు.’సకుటుంబ సపరివార సమేతంగా’ సినిమాని ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వం వహించారు. ఇక ‘తిరుమల తిరుపతి వెంకటేశ’ సినిమాని ఇ.సత్తిబాబు డైరెక్ట్ చేశారు.

6) నాని: నేచురల్ స్టార్ నాని కెరీర్లో కూడా ఇలాంటి అరుదైన సంఘటన చోటు చేసుకుంది.
ఈ జనరేషన్ హీరోల్లో నానికి మాత్రమే ఇలా జరిగింది. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో నాని నటించిన ‘ఎవడే సుబ్రమణ్యం’, సముద్రఖని దర్శకత్వంలో నాని నటించిన ‘జెండాపై కపిరాజు’ సినిమాలు ఒకే రోజున అంటే 2015 మార్చి 21న రిలీజ్ అయ్యాయి.

7) రవితేజ : మాస్ మహారాజ్ రవితేజకి కూడా ఇలాంటి అనుభవం ఎదురైంది. కాకపోతే హీరోగా కాదు సెకండ్ హీరోగా. అవును ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ‘సకుటుంబ సపరివార సమేతంగా’, ఇ.సత్తిబాబు దర్శకత్వంలో తెరకెక్కిన ‘తిరుమల తిరుపతి వెంకటేశ’ సినిమాల్లో రవితేజ సెకండ్ హీరోగా నటించాడు. ఈ 2 సినిమాలు కూడా 2000వ సంవత్సరం డిసెంబర్ 21న రిలీజ్ అయ్యాయి.

కపుల్ ఫ్రెండ్లీ సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Balakrishna
  • #Chiranjeevi
  • #heroes movies releasing in same day
  • #mruthyunjay
  • #Nani

Also Read

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Karthik Subbaraju – Chiranjeevi: కార్తిక్‌ సుబ్బరాజు కథ విన్న చిరంజీవి.. మళ్లీ లైనప్‌ మారుతుందా?

Karthik Subbaraju – Chiranjeevi: కార్తిక్‌ సుబ్బరాజు కథ విన్న చిరంజీవి.. మళ్లీ లైనప్‌ మారుతుందా?

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’ ఎలా ఉంటుందో చెప్పిన నాని… ముందే ఓకే అనుకున్నాక..

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’ ఎలా ఉంటుందో చెప్పిన నాని… ముందే ఓకే అనుకున్నాక..

Nani: మాస్‌ ఇమేజ్‌ వద్దంటూనే మాస్‌ సినిమాలు చేస్తున్న క్లాస్‌ నాని

Nani: మాస్‌ ఇమేజ్‌ వద్దంటూనే మాస్‌ సినిమాలు చేస్తున్న క్లాస్‌ నాని

The Paradise Collections: ‘ది పారడైజ్’ చివర్లో అవస్థలు పడుతోందిగా

The Paradise Collections: ‘ది పారడైజ్’ చివర్లో అవస్థలు పడుతోందిగా

Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

Nani: యాక్షన్‌కి నో… బ్లాక్‌బస్టర్‌ దర్శకుల టచ్‌లోకి నాని

Nani: యాక్షన్‌కి నో… బ్లాక్‌బస్టర్‌ దర్శకుల టచ్‌లోకి నాని

trending news

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

2 hours ago
Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

18 hours ago
Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

22 hours ago
Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

23 hours ago
Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

1 day ago

latest news

Ranabaali: ‘రణబాలి’ ప్లానింగ్‌ ఎవరు చూస్తున్నారు.. భలే ఛాన్స్‌ మిస్‌ అయ్యారా?

Ranabaali: ‘రణబాలి’ ప్లానింగ్‌ ఎవరు చూస్తున్నారు.. భలే ఛాన్స్‌ మిస్‌ అయ్యారా?

20 hours ago
Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

21 hours ago
Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

22 hours ago
Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

23 hours ago
Vijay Devarakonda: ‘రణబాలి’ రిజల్ట్‌.. విజయ్‌ దేవరకొండ ఆఖరి రాగం పాడేశాడా?

Vijay Devarakonda: ‘రణబాలి’ రిజల్ట్‌.. విజయ్‌ దేవరకొండ ఆఖరి రాగం పాడేశాడా?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version