కళ్లముందే కనుమరుగైన తారలు!!!

మనం అభిమానించే తారలు మన కళ్ల ముందే అనుకోని విధంగా ఆకస్మికంగా కనుమరిగై చేరుకొని లోకాలకు వెళ్ళిపోతే, ఎంతో బాధాకరం. అలా మనల్ని బాదల్లో ముంచేసి, మనల్ని వదిలేసి వెళ్ళిన తారలు ఎంతో మంది ఉన్నారు, వారిలో వీరు కూడా ఉన్నారు.

దివ్య భారతి

Divya Bharti,Divya Bharti Moviesఈ భామ బొబ్బిలి రాజా సినిమాతో తెలుగు సినీ పరిశ్రమలోకి అడుగు పెట్టి, శ్రీదేవి తరువాత అంతటి అందమైన తారగా గుర్తింపు పొందింది. అయితే అనుకోని విధంగా, ముంబైలోని వెర్సొవ భవనంలో 5వ ఫ్లోర్ నుంచి కింద పడి మృతి చెందారు.

సౌందర్య

Soundarya,Soundarya Moviesతెలుగు సినీ పరిశ్రమలో టాప్ హీరోయిన్ గా దూసుకుపోయిన సౌందర్య, ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ తరపున ప్రచారానికి వెళుతూ బెంగళూరులో విమాన ప్రమాదంలో మృతి చెందారు.

శ్రీహరి

స్వయం శక్తితో ఎదిగిన వారిలో శ్రీహరికి ప్రత్యేక స్థానం ఉంటుంది, తన నైజామ్ యాసలో ప్రేక్షకులను ఆకట్టుకున్న శ్రీహరి, అనుకోని రీతిలో ముంబై నగరంలో షూటింగ్ లో అనారోగ్యానికి గురై ఆసుపత్రిలో మృతి చెందారు.

ఉదయ్ కిరణ్

టాలీవుడ్ లో మంచి సక్సెస్ హీరోగా పేరు గాంచిన ఉదయ్ కిరణ్, కాల క్రమేణా వెనకబడిపోవడం, సరైన అవకాశాలు లేకపోవడంతో డిప్రెషన్ కు గురయ్యి, ఆత్మ హత్య చేసుకోవడం జరిగింది.

ఆర్తి అగర్వాల్

అందమైన తారగా, మంచి పేరు సంపాదించుకున్న ఈ భామ, వివాహరిత్యా అమెరికాలో సెటిల్ అయిపోగా, అక్కడ లైపో సర్జరీ వికటించడంతో అకస్మాత్తుగా మృతి చెందింది.

అచ్యుత్

టీవీ రంగంలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానం కల్పించుకుని, సినీ రంగంలో అప్పుడప్పుడే నిలదొక్కుకునే క్రమంలో అకస్మాత్తుగా గుండె పోటు రావడంతో మృతి చెందారు.

యషో సాగర్

ఉల్లాసంగా- ఉత్సాహంగా చిత్రంతో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ హీరో, ముంబై నుంచి బెంగళూరు వస్తూ ఉండగా, రోడ్ ప్రమాధంలో మృతి చెందడం చాలా బాధాకరం.

రంగనాధ్

హీరోగా, విలన్ గా, తండ్రిగా, తాతగా, తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుని, 40ఏళ్ల సినీకరియర్ ను అందుకున్న రంగనాధ్ అనుకోని విధంగా తన సొంత ఇంట్లోనే ఆత్మ హత్య చేసుకోవడం అందరినీ కలచి వేసిన విషయం.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus