NTR Fans: 9 మంది జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అరెస్ట్.. కారణం?

హీరోలకు అభిమానులు ఉంటారు అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కానీ వాళ్ళలో రకాలు ఉంటాయి. కొంతమంది హీరోల నటన అంటే ఇష్టపడి వాళ్ళ సినిమాలు చూసి ఆనందపడుతుంటారు. మరికొంతమంది తమ అభిమాన హీరో సినిమాని మళ్ళీ మళ్ళీ చూసి మురిసిపోతుంటారు. మూడో రకం మాత్రం చాలా టఫ్.తమ అభిమాన హీరో సినిమాలు చూడటమే కాకుండా, వాళ్ళ సినిమాల వాల్ పోస్టర్ల దగ్గరనుండి.. వేసుకునే షర్ట్ ల వరకు అన్ని విధాలుగా ఫాలో అవుతారు.

అక్కడితో ఆగరు .. తమ అభిమాన హీరోని ఒక్క మాట అన్నా ఊరుకోరు. చాలా పెద్ద గొడవ చేసేస్తుంటారు. ఒక్కోసారి ఇలాంటి వాటి వల్లే చిక్కుల్లో పడుతుంటారు. ఇక అసలు విషయానికి వచ్చేద్దాం. జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా ఇలాగే చిక్కుల్లో పడ్డారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని చెమ్మనగరిపేటలో సిరివెంకట్, సిరికృష్ణ థియేటర్ ఉంటుంది. అక్కడ ఎన్టీఆర్ అభిమానులు రెండు మేకలను వధించి వాటి రక్తాన్ని ఎన్టీఆర్ ఫ్లెక్సీపై చిందించి, తెగ అరుస్తూ.. హంగామా చేశారు.

(NTR) ఎన్టీఆర్ 40వ జన్మదినం సందర్భంగా అభిమానుల కోసం ‘సింహాద్రి’ సినిమాను రీరిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. అందుకే థియేటర్ వద్ద ఎన్టీఆర్ అభిమానులు ఇలాంటి హంగామా చేశారు. ఈ క్రమంలో పోలీసులు రంగంలోకి దిగి ఎన్టీఆర్ అభిమానులను అరెస్ట్ చేశారు. అభిమానం హద్దులు మీరితే ఇలాంటి అనుభవాలే ఎదురవుతాయని చెప్పాలి. ఈ విషయమై మిగిలిన అభిమానులు ఎన్టీఆర్ టీంని సంప్రదిస్తున్నట్టు తెలుస్తుంది.

బిచ్చగాడు 2 సినిమా రివ్యూ & రేటింగ్!
డెడ్ పిక్సల్స్ వెబ్ రివ్యూ & రేటింగ్!

అన్నీ మంచి శకునములే సినిమా రివ్యూ & రేటింగ్!
పిల్లలను కనడానికి వయస్సు అడ్డుకాదంటున్న సినీతారలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus