యంగ్ టైగర్ ఎన్టీఆర్, లక్ష్మీ ప్రణతి ఇద్దరూ చాలా ముచ్చటగా ఉంటారు. ఇద్దరిదీ ఫర్ఫెక్ట్ జోడీ. ఒకరికోసం ఒకరు పుట్టినట్లుగా కనిపిస్తారు. అయితే వీరిద్దరి మధ్య వయసు తేడా ఎంత తేడా ఉంటుందో చెప్పగలరా? మూడు ,నాలుగేళ్లు డిఫరెన్స్ ఉంటుంది అంతేకదా అని అనుకుంటున్నారా? అయితే మీరు ఫిల్మ్ లో కాలేసినట్లే. ఎన్టీఆర్ కంటే లక్ష్మీ ప్రణతి తొమ్మిదేళ్లు చిన్న. నమ్మలేక పోతున్నారా? అయితే ఇవిగో సాక్షాలు. ప్రముఖ వ్యాపారవేత్త నార్నే శ్రీనివాస్ రావు గారి ఒక్కగానొక్క కూతురు అయిన లక్ష్మీ ప్రణతి 1992 మార్చి 18 న పుట్టారు.
ఇంటర్ పూర్తి అయిన వెంటనే ఎన్టీఆర్ ని 2011 మే 5న వివాహం చేకున్నారు. ఆమెకు 18 ఏళ్లు నిండిన తరవాత తారక్ తాళికట్టారు. అప్పుడు ఎన్టీఆర్ వయసు 27 ఏళ్లు (20 మే 1983 ). ఇద్దరి మధ్య తొమ్మిదేళ్ల గ్యాప్ ఉందని ఇప్పటికైనా నమ్మకం కుదిరిందా!!. ఈ వయసు తేడా ఎన్టీఆర్, లక్ష్మి ప్రణతికి మధ్య ఎప్పుడూ ఆటంకం కాలేదు. ఆదర్శ దంపతులుగా పేరు తెచ్చుకుంటున్నారు. వీరికి ఇప్పుడు అభయ్ రామ్ అనే కొడుకు ఉన్నాడు.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.