49 ఏళ్ళ వయసులో పెళ్లి చేసుకోవాలని ఉంది అంటూ ఓ సీనియర్ స్టార్ హీరోయిన్ చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యాయి. ఆమె మరెవరో కాదు సుస్మితా సేన్ (Sushmita Sen). నాగార్జున (Nagarjuna) హీరోగా తెలుగు, తమిళ భాషల్లో ద్విభాషా చిత్రంగా రూపొందిన ‘రక్షకుడు'(రచ్చ గన్ Ratchagan తమిళ్ లో) చిత్రంతో తెలుగువారికి పరిచయమైంది ఈ మాజీ విశ్వసుందరి. అలాగే అర్జున్ (Arjun)- శంకర్ (Shankar) కాంబినేషన్లో తెరకెక్కిన ‘ఒకే ఒక్కడు’ సినిమాలోని ‘షకలక బేబీ’ అనే పాటతో కూడా తెలుగు రాష్ట్రాలని ఊపేసింది.
అయితే 49 ఏళ్ళ వయసు వచ్చినా ఈ అమ్మడు (Sushmita Sen) ఇంకా పెళ్లి చేసుకోలేదు.అయితే ఇద్దరు అమ్మాయిలని ఈమె దత్తత తీసుకుని తల్లి అనిపించుకుంది. ఇదిలా ఉండగా.. ఇటీవల ఓ సందర్భంలో.. “అవును..! నేను కూడా పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను..! కానీ నాకు తగ్గ వ్యక్తి దొరకాలి. నన్ను అర్థం చేసుకునే వ్యక్తి దొరికితే వివాహం బంధం ఎంతో బాగుంటుంది..! అందుకే నా మనసుకి చేరువయ్యే వ్యక్తి కావాలి.
అప్పుడు వెంటనే పెళ్లి చేసుకుంటాను” అంటూ చెప్పుకొచ్చింది సుస్మితా సేన్ (Sushmita Sen). కానీ ఈ టైంలో ఆమె పెళ్లి చేసుకుంటాను అంటే.. ఆమె పెంపుడు కూతుర్లు ఒప్పుకుంటారా? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. ఇదిలా ఉండగా.. మొన్నామధ్య సుస్మిత, తన కంటే 15 ఏళ్ళు చిన్నవాడైన మోడల్, నటుడు రోహ్మాన్ షాల్ తో డేటింగ్ చేస్తున్నట్లు ప్రచారం జరిగింది. వాళ్ళు కొన్నాళ్లపాటు ప్రేమించుకున్నారు. అయితే 2021లో ఇద్దరూ విడిపోయారు.
విడిపోయాక కూడా ఇద్దరూ మంచి స్నేహితులుగా ఉంటామని తెలిపారు. అటు తర్వాత కొన్నాళ్లకే ఐసీసీ మాజీ చైర్మన్ లలిత్ మోడీతో సుస్మిత (Sushmita Sen) డేటింగ్ చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. మాల్దీవులకి వీరు ట్రిప్ కి వెళ్లినట్టు కూడా ఫోటోలు చర్చలకు దారి తీశాయి. ఇప్పుడేమో ఆమె పెళ్లి చేసుకోవాలని ఉంది అనడం అందరికీ షాకిచ్చింది అనే చెప్పాలి.