“అ.. ఆ” షూటింగ్ పూర్తి!

నితిన్-సమంత జంటగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న “అ ఆ” చిత్రీకరణ పూర్తయిపోయింది. శనివారం సాయంత్రం ఈ చిత్రానికి గుమ్మడికాయ కొట్టేసారు. మిక్కీ జె.మేయర్ స్వరాలు సమకూర్చనున్న ఈ చిత్రం ఆడియోను వచ్చే నెల విడుదల చేయనున్నారు.

నిజానికి ఈ చిత్రాన్ని మే 6న విడుదల చేయాలని తొలుత అనుకొన్నారు. కారణాంతరాలవలన అది సాధ్యపడలేదు. దాంతో ఈ చిత్రాన్ని మే నెలాఖరున విడుదల చేయాలని చూస్తున్నారు. త్రివిక్రమ్ శైలి క్యూట్ అండ్ స్వీట్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ చిత్రంలో నదియా అత్త పాత్రలో నటించనుంది. ఈ సినిమాలో అత్తా-అల్లుళ్ల మధ్య జరిగే పోటీ/అల్లరి సినిమాకి మెయిన్ ఎస్సెట్ గా నిలుస్తుందని తెలుస్తోంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus