మీనా Vs. అ..ఆ

  • June 12, 2016 / 02:33 PM IST

త్రివిక్రమ్ తాజా చిత్రం “అ..ఆ” అపూర్వ విజయం సాధించింది. ఈ సినిమాకు, 1971 లో వచ్చిన మీనా సినిమాకు ప్రముఖ నవల రచయిత యద్దనపూడి సులోచనారాణి రాసిన మీనా నవల ఆధారం. ఈ విషయాన్నిమాటల మాంత్రికుడు కూడా స్పష్టం చేసారు. ప్రపంచంలోనే అత్యధిక చిత్రాలకు దర్శకత్వం వహించిన మహిళగా విజయ నిర్మల గిన్నిస్ బుక్ రికార్డ్ అందుకున్నారు.

ఆమె నుంచి వచ్చిన తొలి సినిమా “మీనా”. విజయ నిర్మల ఓ వైపు దర్శకత్వం చేస్తూనే .. మరో వైపు సినిమాలో టైటిల్ రోల్ పోషించారు. ఇందులో సూపర్ స్టార్ కృష్ణ తన ఇమేజ్ ని పక్కన పెట్టి నటించారు. మూడు గంటల నిడివిగల ఈ చిత్రం అప్పట్లో సూపర్ హిట్. “అ..ఆ” సినిమా హిట్ తో మళ్లీ మీనా చిత్రాన్ని చూసే వారి సంఖ్య పెరుగుతోంది. ఆనాటి.. ఈ నాటి సినిమాల్లోని పాత్రలను పోల్చుకుంటున్నారు.

విజయ నిర్మల Vs. సమంత“మీనా” సినిమాలో మీనా పాత్ర చుట్టూ కథ సాగుతుంది. చిన్న విషయాలకు అలిగే పాత్రలో విజయ నిర్మల ఇమిడిపోయారు. అ..ఆ చిత్రంలో మీనా పేరును అనసూయగా మార్చారు. ఈ పాత్రలో సమంత అనుభవం ఉన్ననటిలా నటించారు.

కృష్ణ Vs. నితిన్“మీనా” సినిమాలో సూపర్ స్టార్ కృష్ణ “కృష్ణ రావు” గా కనిపించిన పాత్రను అ..ఆ చిత్రంలో నితిన్ “ఆనంద్ విహారిగా చేశారు. హీరోయిన్ కి ఎక్కువ స్కోప్ ఉన్న సినిమా అయిన ఈ యంగ్ హీరో అంగీకరించి హిట్ ని తన ఖాతాలో వేసుకున్నాడు.

గుమ్మడి Vs. నరేష్మీనా తండ్రి పాత్రలో గుమ్మడి ఆనాడు ఆకట్టుకోగా .. ఈనాడు సమంతకు నాన్నగా నరేష్ అలరించాడు. భార్యకు భయపడే భర్తగా, సరైన సమయంలో సూచనలు ఇచ్చే లాయర్ గా ఈ పాత్రకు ఇద్దరూ న్యాయం చేశారు.

చంద్రకళ Vs. అనన్యమీనా సినిమాలో కృష్ణకు చెల్లెలి రాజీ పాత్రను ఆనాటి హీరోయిన్ చంద్రకళ చేసారు. విజయ నిర్మలకు సేవలు చేస్తూ .. అపుడప్పుడు సెంటిమెంట్ పండించారు. అ..ఆ లో నితిన్ చెల్లెలుగా అనన్య భానుమతి పాత్రకు ప్రాణం పోశారు.

కృష్ణ వేణి Vs. నదియామీనా సినిమాలో అహంకారం కలిగిన గొప్పింటి మహిళగా, హీరోయిన్ తల్లిగా కృష్ణవేణి మెప్పించారు. అ..ఆ లో సమంతకు తల్లిగా నదియా జీవించి.. సినిమా విజయానికి దోహద పడ్డారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus