Sandeep Reddy Vanga: ప్రభాస్ కోసం సందీప్ రూట్ మారుస్తారా.. డైలాగ్స్ విషయంలో అలా చేస్తారా?

స్టార్ హీరో ప్రభాస్  (Prabhas) , స్టార్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) కాంబినేషన్ లో స్పిరిట్ టైటిల్ తో ఒక సినిమా తెరకెక్కుతుండగా ఈ సినిమా బడ్జెట్ ఏకంగా 500 కోట్ల రూపాయలు అని వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి. అయితే సాధారణంగా ప్రభాస్ సింపుల్ డైలాగ్స్ చెప్పడానికి ఇష్టపడతారు. ఛత్రపతి (Chatrapathi), మిర్చి (Mirchi) సినిమాలలో లెంగ్తీ డైలాగ్స్ చెప్పినా ఒక లిమిట్ దాటి డైలాగ్స్ చెప్పలేదు. అయితే సందీప్ రెడ్డి వంగా సినిమాల్లో డైలాగ్స్ ప్రభాస్ సినిమాల డైలాగ్స్ కు భిన్నంగా ఉంటాయి.

Sandeep Reddy Vanga

స్పిరిట్ సినిమా డైలాగ్స్ ను సందీప్ ప్రభాస్ స్టైల్ లో రాస్తారా? లేక తన మార్క్ డైలాగ్స్ ను ప్రభాస్ చేత చెప్పిస్తారా? అనే చర్చ జరుగుతోంది. అయితే ఎక్కువమంది ఫ్యాన్స్ మాత్రం సందీప్ మార్క్ డైలాగ్స్ ప్రభాస్ నోటి వెంట వినాలని కామెంట్లు చేస్తుండగా ఆ కామెంట్లు సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అవుతున్నాయి. డైలాగ్స్ విషయంలో ఏం జరుగుతుందో త్వరలో క్లారిటీ వచ్చే ఛాన్స్ అయితే ఉంది.

ప్రభాస్ రెమ్యునరేషన్ ఒకింత భారీ స్థాయిలో ఉండగా బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ప్రభాస్ కెరీర్ ప్లాన్ చేసుకుంటున్నారు. ప్రభాస్ లేకుండానే ఫౌజీ మూవీ షూట్ మొదలైందని సమాచారం అందుతోంది. ప్రభాస్ ఈ సినిమా షూటింగ్ లో పాల్గొనడానికి మరికొన్ని రోజుల సమయం పట్టే ఛాన్స్ ఉంది. ప్రస్తుతం మధురైలో ఈ సినిమా షూటింగ్ జరుగుతోందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.

ప్రభాస్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో కష్టపడుతున్న తీరును ఫ్యాన్స్ తెగ మెచ్చుకుంటున్నారు. ప్రభాస్ పెళ్లి చేసుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటుండగా ప్రభాస్ పెళ్లికి సంబంధించిన శుభవార్త చెబుతారో లేదో చూడాల్సి ఉంది. ప్రభాస్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో విజయాలను సైతం అందుకుంటే బాగుంటుందని అభిమానులు ఫీలవుతుండటం గమనార్హం. ఫ్యాన్ ఫాలోయింగ్ పరంగా ఇతర హీరోలకు అందనంత ఎత్తులో ప్రభాస్ ఉన్నారనే సంగతి తెలిసిందే.

క్రేజీ సీక్వెల్లో అనుష్క.. నిజమేనా!?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus