Bhaagamathie Sequel: క్రేజీ సీక్వెల్లో అనుష్క.. నిజమేనా!?

తెలుగుతో సమానంగా తమిళంలో కూడా స్టార్ హీరోయిన్ గా క్రేజ్ తెచ్చుకున్న అనుష్క (Anushka Shetty).. ‘బాహుబలి’ (Baahubali) తో బాలీవుడ్లో కూడా పాపులర్ అయ్యింది. కానీ ఇప్పుడు ఆమె రెగ్యులర్ గా సినిమాలు చేయడం లేదు. ‘బాహుబలి 2’ (Baahubali 2)తర్వాత చూసుకుంటే.. ఆమె ‘భాగమతి’ (Bhaagamathie) ‘సైరా నరసింహారెడ్డి’ ‘నిశ్శబ్దం’ (Nishabdham) ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ (Miss Shetty Mr Polishetty) వంటి సినిమాలు చేసింది. అంటే ఈ 7 ఏళ్లలో ఆమె చేసింది 4,5 సినిమాలు మాత్రమే. అనుష్కకి ఉన్న క్రేజ్ ను బట్టి చూస్తే..

Bhaagamathie Sequel

వరుస సినిమాలకి సైన్ చేసి ఆమె బాగా క్యాష్ చేసుకోవచ్చు. కానీ ఆమె అలా చేయదు. అందుకే దర్శకనిర్మాతలకు ఆమె స్వీటీ అయ్యింది. ప్రస్తుతం క్రిష్ (Krish Jagarlamudi) డైరెక్షన్లో అనుష్క ఓ సినిమా చేస్తుంది.వచ్చే ఏడాది… అది ప్రేక్షకుల ముందుకు వచ్చే ఛాన్స్ ఉంది. ఇది షూటింగ్ దశలో ఉండగానే ఆమె మరో క్రేజీ ప్రాజెక్టుకి సైన్ చేసినట్టు తెలుస్తుంది. 2018 లో వచ్చిన ‘భాగమతి’ సినిమా సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే.

ఆ సినిమాలో అనుష్క నటన.. తమన్ (S.S.Thaman) బ్యాక్ గ్రౌండ్ స్కోర్ హైలెట్ గా నిలిచాయి. బాక్సాఫీస్ వద్ద ఆ సినిమా భారీ వసూళ్లు సాధించింది. ఇప్పుడు ఆ సినిమాకి సీక్వెల్ రాబోతున్నట్టు తెలుస్తుంది. ‘భాగమతి 2’ (Bhaagamathie ) టైటిల్ తోనే ఆ సినిమా రూపొందనుంది అని సమాచారం. ఈ చిత్రాన్ని కూడా జి.అశోక్ (G. Ashok) డైరెక్ట్ చేస్తాడని ఫిలింనగర్ టాక్. త్వరలోనే ఈ ప్రాజెక్టు గురించి మరిన్ని వివరాలు బయటకు వచ్చే ఛాన్స్ ఉందట.

‘రాబిన్ హుడ్’ కోసమే ‘పుష్ప 2’ వాయిదా గురించి స్పందించడం లేదా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus