శ్రీవిష్ణు.. టాలీవుడ్లో ఉన్న ప్రామిసింగ్ హీరోల్లో ఒకరు. మంచి కథలు పికప్ చేసుకోగల సమర్ధుడు. నాన్ స్టాప్ గా కథలు వింటూనే ఉంటానని ఇటీవల చెప్పాడు. గతంలో ఇతనికి ‘బ్రోచేవారెవరురా’ ‘రాజ రాజ చోర’ వంటి హిట్లు ఉన్నాయి. అయితే ‘రాజ రాజ చోర’ తర్వాత శ్రీవిష్ణుకి ప్లాపులు ఎదురయ్యాయి.’అర్జున ఫల్గుణ’ ‘భళా తందనాన’ ‘అల్లూరి’ వంటి సినిమాలు చేసి ప్లాపులు మూటగట్టుకున్నాడు. ఇవి తన మార్క్ సినిమాలు కాదు. అందుకే సక్సెస్ కాలేదు.
జనాలు కూడా ఆ సినిమాల పై ఇంట్రెస్ట్ చూపించలేదు. అయితే తాజాగా వచ్చిన ‘సామజవరగమన’ మాత్రం అతని కష్టానికి తగ్గ ఫలితాన్ని ఇచ్చింది. ఆదివారం రోజు కలెక్షన్స్ తో ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో బ్రేక్ ఈవెన్ సాధించింది . ఓవర్సీస్ లో అయితే భారీ లాభాలను అందించింది. ఇంకా అక్కడ సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతుంది. దీంతో అతనికి రిలీఫ్ దక్కినట్టయ్యింది.
‘సామజవరగమన’ అనేది పక్కా (Sree Vishnu) శ్రీవిష్ణు మార్క్ మూవీ. క్లాస్ అండ్ ఫ్యామిలీ ఆడియన్స్.., అతని సినిమాల నుండి ఆశించే ఫన్ అంతా ఈ సినిమాలో ఉంది. ఫస్ట్ హాఫ్ అయితే హిలేరియస్ గా ఉంటుంది. సెకండ్ హాఫ్ కూడా ఎక్కడా బోర్ కొట్టదు. గతంలో ఎవ్వరూ టచ్ చేయని పాయింట్ ఇది. ఇలాంటి స్క్రిప్ట్ లు శ్రీవిష్ణుకి టైలర్ మేడ్ లాంటివి. మరి ఈ సినిమా తర్వాత అతని స్క్రిప్ట్ సెలక్షన్ ఎలా ఉంటుందో చూడాలి.