Mahesh Babu: అబ్బో మహేష్ అభిమానులకు ఇది పెద్ద షాకింగ్ న్యూసే..!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ అభిమానులు మే 31 కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆ రోజు మహేష్ బాబు తండ్రి సూపర్ స్టార్ కృష్ణ గారి పుట్టినరోజు కావడంతో.. మహేష్ కొత్త సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ ఇస్తారని వారి ఆశ. ప్రస్తుతం మహేష్ బాబు.. పరశురామ్(బుజ్జి) డైరెక్షన్లో చేయబోతున్న ‘సర్కారు వారి పాట’ ఫస్ట్ లుక్, త్రివిక్రమ్ డైరెక్షన్లో చేయబోతున్న సినిమాకి సంబంధించిన టైటిల్ అనౌన్స్మెంట్, అలాగే రాజమౌళి ప్రాజెక్టు అనౌన్స్మెంట్ కూడా ఉంటుందని వారు భావించారు.

ఆ 3 అప్డేట్ లకు సంబంధించిన హ్యాష్ ట్యాగ్ లతో ఆ రోజు సోషల్ మీడియాలో భారీ ఎత్తున ట్రెండ్ చేయాలని వారు డిసైడ్ అయినట్లు కూడా వారు భావించారు. అయితే సూపర్ స్టార్ కృష్ణ గారు ఆ రోజున.. మహేష్ సినిమాలకు సంబంధించి ఎటువంటి అప్డేట్స్ ఇవ్వొద్దని కోరినట్టు తెలుస్తోంది. అందుకు కారణం కూడా లేకపోలేదు. కృష్ణ మరియు మహేష్ బాబు లకు అత్యంత సన్నిహితుడు మరియు ప్రముఖ సినీ పాత్రికేయులు, నిర్మాత అయిన బి.ఎ.రాజు.. ఇటీవల మరణించారు.

దాంతో కృష్ణ తన పుట్టినరోజు నాడు.. హంగులు, ఆర్భాటాలు వంటి వాటికి దూరంగా ఉండాలి అని భావిస్తున్నట్లు సమాచారం. ఆ అప్డేట్స్ ను మరో రోజుకి పోస్ట్ పోన్ చేయాలనే ఆలోచనలో కూడా మహేష్ బాబు భావిస్తున్నట్టు సమాచారం. అదే కనుక నిజమైతే.. మహేష్ అభిమానుల ఆనందానికి బ్రేకులు పడినట్టే అని చెప్పాలి.

Most Recommended Video

టాలీవుడ్ స్టార్ హీరోల ఫేవరెట్ ఫుడ్స్ ఇవే..?
ఈ 10 సినిమాల్లో కనిపించని పాత్రలను గమనించారా?
2020 లో పాజిటివ్ టాక్ వచ్చినా బ్రేక్ ఈవెన్ కానీ సినిమాల లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus