Trivikram, Jr NTR: త్రివిక్రమ్ తారక్ పూర్తిగా విడిపోయినట్టేనా..?

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇండస్ట్రీలోకి దాదాపు ఒకే సమయంలో ఎంట్రీ ఇచ్చారు. తారక్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో అరవింద సమేత సినిమా తెరకెక్కి 2018 సంవత్సరంలోని బ్లాక్ బస్టర్ హిట్లలో ఒకటిగా నిలిచింది. తారక్ స్టైల్ లో త్రివిక్రమ్ తెరకెక్కించిన ఈ సినిమా ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు తెగ నచ్చింది. త్రివిక్రమ్ ఈ సినిమాలో యాక్షన్ సన్నివేశాలను అద్భుతంగా తెరకెక్కించారు. అరవింద సమేత సినిమా షూటింగ్ సమయంలోనే ఎన్టీఆర్,

త్రివిక్రమ్ కాంబినేషన్ లో మరో సినిమా తెరకెక్కుతున్నట్టు వార్తలు రాగా అల వైకుంఠపురములో సినిమా తరువాత ఎన్టీఆర్ తో సినిమా చేస్తున్నట్టు త్రివిక్రమ్ కన్ఫామ్ చేశారు. అయితే ఊహించని విధంగా ఈ ప్రాజెక్ట్ ఆగిపోవడంతో పాటు ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ మధ్య గ్యాప్ పెరిగింది. తారక్, త్రివిక్రమ్ మళ్లీ కలిసి పని చేస్తారా..? అనే ప్రశ్నలు ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్నాయి. ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్ ప్రకటన వెలువడిన సమయంలో త్రివిక్రమ్ ఆల్ ది బెస్ట్ చెప్పారు.

ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా త్రివిక్రమ్ ఎన్టీఆర్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు. త్రివిక్రమ్ ఎన్టీఆర్ తో కలిసి పని చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారని తెలుస్తోంది. మరి ఎన్టీఆర్ త్రివిక్రమ్ తో కలిసి పని చేయడానికి ఆసక్తి చూపుతారో ఏదో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే. ప్రస్తుతానికైతే ఎన్టీఆర్, త్రివిక్రమ్ మధ్య దూరం పెరిగిందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.

Most Recommended Video

టాలీవుడ్ స్టార్ హీరోల ఫేవరెట్ ఫుడ్స్ ఇవే..?
ఈ 10 సినిమాల్లో కనిపించని పాత్రలను గమనించారా?
2020 లో పాజిటివ్ టాక్ వచ్చినా బ్రేక్ ఈవెన్ కానీ సినిమాల లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus