Salaar: ప్రభాస్ ఫ్యాన్స్ కు అదిరిపోయే అప్ డేట్.. సలార్ విషయంలో శుభవార్త ఇదే!

టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన ప్రభాస్ మరో 40 రోజుల్లో సలార్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. బాహుబలి2 సినిమా తర్వాత సరైన బ్లాక్ బస్టర్ హిట్ లేని ప్రభాస్ సలార్ సినిమాతో ఆ లోటును తీర్చడం ఖాయమని కామెంట్లు వినిపిస్తున్నాయి. సలార్ సినిమాలో ఒకే ఒక్క సాంగ్ ఉందని మిగతా సాంగ్స్ అన్నీ బ్యాగ్రౌండ్ సాంగ్స్ అని సమాచారం అందుతోంది. సలార్ మూవీ ఐమ్యాక్స్ వెర్షన్ రిలీజ్ ఉందని యూఎస్ డిస్ట్రిబ్యూటర్స్ నుంచి క్లారిటీ వచ్చింది.

సలార్ (Salaar) ఐమ్యాక్స్ వెర్షన్ రిలీజ్ కానుండటంతో ఫ్యాన్స్ ఎంతగానో సంతోషిస్తున్నారు. సలార్ తెలుగు రాష్ట్రాల హక్కులు భారీ మొత్తానికి అమ్ముడయ్యాయని సమాచారం అందుతోంది. ప్రశాంత్ నీల్ ప్రస్తుతం సలార్ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులతో బిజీగా ఉన్నారని సమాచారం అందుతోంది. ప్రశాంత్ నీల్ ను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతుండగా ప్రభాస్ కు ప్రశాంత్ నీల్ ఏ రేంజ్ హిట్ ఇస్తారో చూడాల్సి ఉంది.

సలార్2 సినిమా షూటింగ్ కూడా పూర్తైందని వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా సలార్2 రిలీజ్ కానుందని సమాచారం అందుతోంది. ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబో మూవీ షూటింగ్ వచ్చే ఏడాది మార్చి నెలలో మొదలుకానుంది. 2025 సంవత్సరంలో ఈ సినిమా విడుదల కానుంది. ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబో మూవీలో హీరోయిన్ గా ఎవరు నటిస్తారనే ప్రశ్నకు సంబంధించి సమాధానం దొరకాల్సి ఉంది.

సలార్1, సలార్2 సినిమాలతో బాక్సాఫీస్ ను షేక్ చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఈ సినిమాలు అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించడం ఖాయమని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. సలార్1, సలార్2 సినిమాలతో ప్రభాస్ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు క్రియేట్ చేసే అవకాశం అయితే ఉందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ప్రభాస్ ను అభిమానించే వాళ్ల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.

మిస్టర్ ప్రెగ్నంట్ సినిమా రివ్యూ & రేటింగ్!

ప్రేమ్ కుమార్ సినిమా రివ్యూ & రేటింగ్!
గత 10 సినిమాల నుండి రజనీకాంత్ సినిమాల థియేట్రికల్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus