Pushpa2: పుష్ప -2 డిస్ట్రిబ్యూషన్ హక్కులు ఎన్నికోట్లో తెలిస్తే మతిపోతోంది..!

  • September 5, 2023 / 10:49 PM IST

పుష్ప ది రైజ్ మూవీకి సీక్వెల్ గా వస్తున్న సినిమా పుష్ప ది రూల్. ఫస్ట్ పార్ట్ సూపర్ డూపర్ హిట్ అవడంతో ఈ సీక్వెల్ పై భారీ అంచనాలు ఉన్నాయి. ముఖ్యంగా పుష్ప కోసం అల్లు అర్జున్ బెస్ట్ యాక్టర్ గా నేషనల్ అవార్డు గెలుచుకున్న నేపథ్యంలో ఈ మూవీ క్రేజ్ మరింత పెరిగింది. ఈ సినిమా వచ్చే ఏడాది వేసవిలో రిలీజ్ కానుంది. అయితే తాజాగా వస్తున్న సమాచారం మేరకు.. ఈ సినిమా డిస్ట్రిబ్యూషన్ హక్కుల కోసం ఉత్తరాదికి చెందిన ఓ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ గట్టిగానే ప్రయత్నిస్తోంది.

ఎంతలా అంటే.. సినిమా మొత్తం హక్కుల కోసం రూ.1000 కోట్లు చెల్లిస్తామని ఆ సంస్థ ఆఫర్ ఇవ్వడం విశేషం. పుష్ప ది రూల్ మూవీకి ఏ స్థాయి క్రేజ్, బజ్ క్రియేటయ్యాయో చెప్పడానికి ఇదే నిదర్శనం. అయితే ఇంత పెద్ద ఆఫర్ వచ్చినా సినిమా మేకర్స్ అయిన మైత్రీ మూవీ మేకర్స్ ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదట. మరింత పెద్ద డీల్ కోసం వాళ్లు చూస్తున్నట్లు సమాచారం. పుష్ప 2 (Pushpa2) మూవీ పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ కాబోతోంది.

ఏకంగా రూ.450 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుండటం విశేషం. ఫస్ట్ పార్ట్ అంతగా అంచనాలు లేకుండా రిలీజైంది. కానీ అది కాస్తా అంచనాలకు మించి హిట్ అవడంతో ఇప్పుడు సీక్వెల్ కు రెట్టింపు ఆఫర్లు వస్తున్నాయి. ఈ సినిమా డిస్ట్రిబ్యూషన్ హక్కులకే కాదు.. ఓటీటీ, శాటిలైట్ హక్కుల కోసం కూడా గట్టి పోటీయే ఉంది. వచ్చే ఏడాది మార్చి 22న ఈ సినిమా రిలీజ్ చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి.

మంది పార్టిసిపెంట్స్ తో దుమ్ము లేచిపోయిన బిగ్ బాస్ సీజన్ 7 స్టేజ్..!

సీజన్ – 7 లో 5 బ్లండర్ మిస్టేక్స్ ఇవే..!
‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ తో పాటు ఈ వారం విడుదల కాబోతున్న 20 సినిమాలు/సిరీస్ ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus