‘సితార ఎంటర్‌టైన్‌మెంట్స్’ అధినేత ఎస్.నాగ వంశీ ప్రస్తుతం టాలీవుడ్లో టాప్ లీడింగ్ ప్రొడ్యూసర్స్ లో ఒకరు. వరుస సినిమాలు చేస్తూ హిట్ పర్సెంటేజ్ ఎక్కువ కలిగిన నిర్మాతగా కూడా నాగవంశీ నిలిచారు. ప్రస్తుతం అతని బ్యానర్లో డజనుకు పైగా సినిమాలు సెట్స్ పై ఉన్నాయి. ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరో కూడా సినిమా చేస్తానని మాట ఇచ్చాడు. మరోపక్క డిస్ట్రిబ్యూషన్ లో కూడా చురుగ్గా పాల్గొంటున్నారు. గతేడాది వచ్చిన ఎన్టీఆర్ ‘దేవర’ థియేట్రికల్ హక్కులను భారీ రేటు పెట్టి కొనుగోలు చేశాడు.
ఓవర్సీస్ డిస్ట్రిబ్యూషన్ లో కూడా పట్టు సాధించాడు అనే టాక్ కూడా గట్టిగానే ఉంది. అయితే నాగవంశీకి ఆగస్టు నెల చాలా కీలకం అని చెప్పాలి. ఎందుకంటే అతని నిర్మాణంలో రూపొందిన 2 సినిమాలు, అలాగే అతను డిస్ట్రిబ్యూషన్ చేస్తున్న ఓ పెద్ద సినిమా రిలీజ్ కానుంది. అందులో విజయ్ దేవరకొండ తో చేసిన ‘కింగ్‌డమ్’ ఉంది. ఈ సినిమా కోసం నాగవంశీ రూ.110 కోట్ల బడ్జెట్ పెట్టారు.
టీజర్, ట్రైలర్ బాగున్నాయి. బజ్ క్రియేట్ చేశాయి. అనేక సార్లు వాయిదా పడి ఎట్టకేలకు జూలై 31న రిలీజ్ కాబోతుంది. ఈ సినిమాతో ప్లాపుల్లో ఉన్న విజయ్ దేవరకొండకి హిట్ ఇవ్వాల్సిన బాధ్యత నాగవంశీ పై ఉంది. ఆగస్టు 8 వరకు ‘కింగ్డమ్’ కి సోలో రన్ ఉంటుంది. మళ్ళీ ఆగస్టు 14న.. నాగవంశీ డిస్ట్రిబ్యూట్ చేస్తున్న ‘వార్ 2’ రిలీజ్ అవుతుంది. రూ.80 కోట్లు పెట్టి ఈ సినిమా హక్కులను దక్కించుకున్నారు నాగవంశీ.
‘కూలి’ తో పోటీ పడి ఈ సినిమా అంత మొత్తం రికవరీ చేస్తుందా లేదా? అనేది తెలియాల్సి ఉంది.అటు తర్వాత అంటే ఆగస్టు 27న రవితేజతో నాగవంశీ నిర్మించిన ‘మాస్ జాతర’ రిలీజ్ కానుంది. ఈ సినిమాని కూడా దాదాపు రూ.65 కోట్లు పెట్టి నిర్మించారు నాగవంశీ. దీంతో కూడా రవితేజకి హిట్ ఇవ్వాల్సిన బాధ్యత నాగవంశీపై ఉంది. సో ఇలా ఆగస్టులో నాగవంశీ పై పెద్ద బాధ్యతలే ఉన్నాయి.