Shine Tom Chacko: ఎట్టకేలకు ఓపెన్‌ అయిన ‘దసరా’ విలన్‌.. ఆమెకు బహిరంగ క్షమాపణ!

గత కొన్ని నెలలుగా మాలీవుడ్‌ సినిమాను ఓ కుదుపు కుదిపేస్తున్న అంశం ‘షైన్‌ టామ్‌ చాకో’. ఓ సినిమా షూటింగ్‌ జరుగుతున్నప్పుడు షైన్‌ టామ్‌ చాకో తనతో ఇబ్బందికరంగా ప్రవర్తించాడంటూ నటి విన్సీ సోనీ అలోషియస్‌ కొన్ని రోజుల క్రితం ఆరోపించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఆమె మలయాళ ఫిల్మ్‌ ఛాంబర్‌లో కూడా ఫిర్యాదు చేసింది. అదే సమయంలో షైన్‌ టామ్‌ చాకో వ్యక్తిగత విషయాల్లో ఇబ్బందులు రావడంతో ఈ వివాదానికి కాస్త పాజ్‌ పడింది.

Shine Tom Chacko

దీంతో ఎప్పటికి ఈ విషయం తేలుతుందో అని అందరూ అనుకుంటుండగా షైన్‌ టామ్‌ చాకో ఈ విదానికి ముగింపు పలికే ప్రయత్నం చేశారు. వీరిద్దరూ కలిసి నటించిన ‘సూత్రవాక్యం’ సినిమా ప్రచారంలో భాగంగా బహిరంగ క్షమాపణలు చెప్పి ఈ వివాదానికి ముగింపు పలికే ప్రయత్నం చేశాడు షైన్‌ టామ్‌ చాకో. జరిగిన దానికి క్షమాపణలు చెబుతున్నా. అది కావాలని చేసింది కాదు. నేను సరదాగా చెప్పానంతే అని ఏం జరిగిందో చెప్పే ప్రయత్నం చేశాడు.

ఇక ఆ విషయంఓల విన్సీ అంత తీవ్రంగా స్పందించడానికి కూడా కారణం ఉంది. ఎవరో ఆమెను వెనుకుండి ప్రోత్సహించారు అని చాకో ఓ కామెంట్‌ చేశాడు. దీంతో ఆ వెనుకున్న వ్యక్తి ఎవరు అనే చర్చ ఇప్పుడు మొదలైంది. ఇక ప్రెస్‌ మీట్‌లో చాకో పక్కనే కూర్చొన్న విన్సీ కూడా మాట్లాడారు. ఆ సమయంలో నాకు ఇబ్బంది కలిగిన మాట వాస్తవం. ఆయన నుంచి అలాంటి పరిస్థితి నేను ఊహించలేదు అని చెప్పింది.

తాను స్పందించిన తీరు చాకో కుటుంబాన్ని బాధించిందని చెప్పిన విన్సీ.. ఇప్పుడు ఆ వివాదం సమసిపోయింది అని చెప్పారు. ఆ మాటలకు చాకో స్పందిస్తూ.. ‘నేను కూడా అలా చేస్తానని అనుకోలేదు. నీకు ఇబ్బంది కలిగి ఉంటే క్షమించు’ అని అన్నాడు. దానికి విన్సీ ‘ఇప్పుడు చాకోపై గౌరవం మరింత పెరిగింది. మార్పు కనపడుతోంది. తన తప్పు తెలుసుకున్నారు’ అని అంది. ఈ నేపథ్యంలో వివాదం ముగిసినట్లే అని చెప్పొచ్చు.

విజయ్ దేవరకొండకి.. ఈసారి కూడా పెద్ద టాస్కే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus