Pushpa2: పుష్ప2 సినిమాకు ఆ రేంజ్ లో థియేటర్లు కష్టమేనా.. ఏం జరిగిందంటే?

అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కిన పుష్ప2 మూవీ ఈ ఏడాది ఆగష్టు నెల 15వ తేదీన రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాకు పోటీగా ఎక్కువ సంఖ్యలో సినిమాలు విడుదలవుతూ ఉండటం గమనార్హం. పుష్ప2 సినిమా ఆ తేదీ నుంచి వాయిదా పడితే నాని సరిపోదా శనివారం ఆ డేట్ కోసం ఎదురుచూస్తోంది. పలు బాలీవుడ్ సినిమాలు, హాలీవుడ్ ప్రాజెక్ట్ లు అదే డేట్ కు థియేటర్లలో రిలీజ్ కానున్నాయని తెలుస్తోంది.

ఇతర భాషల్లోని ఏడు సినిమాలతో పుష్ప2 సినిమాకు పోటీ ఉండబోతుందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. ఎక్కువ సంఖ్యలో సినిమాలు పుష్ప2 సినిమాకు పోటీగా విడుదలైతే ఆ సినిమాలు కూడా కలెక్షన్ల విషయంలో నష్టపోక తప్పదు. దేవర వాయిదా పడటం ఖాయమని తేలిపోవడంతో ఈ సినిమా కూడా ఆ డేట్ పై ఫోకస్ పెట్టింది. ఇండియన్2, సింగ్3 మరికొన్ని సినిమాలు ఈ డేట్ పై దృష్టి పెట్టాయి.

పుష్ప సినిమాకు సీక్వెల్ కావడంతో పుష్ప2 సినిమాకే ఎక్కువ ప్రాధాన్యత ఉన్నా కలెక్షన్ల విషయంలో సంచలన రికార్డులు క్రియేట్ చేయాలంటే మాత్రం రికార్డ్ స్థాయిలో థియేటర్లు దక్కాలి. నైజాంలో ఈ సినిమాను మైత్రీ నిర్మాతలు సొంతంగా రిలీజ్ చేస్తే బాగుంటుందని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా పుష్ప2 సినిమా నుంచి ఒక ఫోటో లీకైన సంగతి తెలిసిందే.

లీకైన ఫోటో పుష్ప2 (Pushpa2) సినిమాపై అంచనాలను మరింత పెంచేసింది. ఇతర భాషల్లో సైతం ఈ సినిమా భారీ స్థాయిలో రిలీజ్ కానుంది. పుష్ప ది రూల్ సినిమాలో యాక్షన్ సీన్స్ కూడా నెక్ట్స్ లెవెల్ లో ఉండబోతుందని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పుష్ప2 సినిమాలో రష్మిక రోల్ కూడా స్పెషల్ గా ఉందని తెలుస్తోంది. బన్నీ ఫహద్ ఫాజిల్ కాంబో సీన్లు నెక్ట్స్ లెవెల్ లో ఉండబోతున్నాయని సమాచారం అందుతోంది.

‘గుంటూరు కారం’ లో ఆకట్టుకునే డైలాగులు ఇవే.!

‘గుంటూరు కారం’ తో పాటు సంక్రాంతి సీజన్ వల్ల సేఫ్ అయిన 10 సినిమాల లిస్ట్.!
2023లో అభినయంతో ఆకట్టుకున్న అందాల భామలు.!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus