ప్రభాస్ పై అభిమానం కురిపించిన పోలీస్ అధికారిణి!

తెరపై ప్రభాస్ కనిపించగానే విజిల్స్ తో థియేటర్ దద్దరిల్లిపోతుంది. డైలాగ్స్ కి, ప్రతి పంచ్ కి చప్పట్ల మోత మోగాల్సిందే. తన నటనతో అందరినీ అలరించే ప్రభాస్ .. ఓ పోలీస్ అధికారిణికి ప్రేరణగా నిలిచారు. ఆ విషయాన్నీ ఆమె స్వయంగా వెల్లడించారు. వివరాల్లోకి వెళితే… ఈనెల 23న ప్రభాస్ 38వ పుట్టినరోజును అభిమానులు ఘనంగా నిర్వహించారు. బాహుబలి సినిమాలతో ఈసారి దేశవ్యాప్తంగా ఫ్యాన్స్ అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించారు. అలహాబాద్ సిటీ పోలీస్ మహిళా క్రైం బ్రాంచ్ విభాగం వారు తమ డ్యూటీ అనంతరం అంతా కలిసి ప్రభాస్ బర్త్‌డేని సెలబ్రేట్ చేసుకోవడం ఈ సారి మరింత స్పెషల్.

వారిలో ఒక అధికారిణికి ప్రభాస్‌ అంటే చాలా ఇస్టమని తెలిసింది. సెలబ్రేషన్ అనంతంరం ఆమె మాట్లాడుతూ “ప్రభాస్ బర్త్‌డేని సెలబ్రేట్ చేస్తున్నందుకు చాలా ఆనందంగా ఫీలవుతున్నాం. మా శుభాకాంక్షలు ఆయనకు చేరాలని కోరుకుంటున్నాం” అన్నారు. ఇంకా ఆమె మాట్లాడుతూ … “ప్రభాస్ నా లైఫ్. నా జీవితంలో నేను ఎన్నో బాధలను అనుభవించాను.. కానీ స్ట్రగుల్స్‌లో ఉన్న ప్రతిసారీ ఆయన్ను స్క్రీన్‌పై చూసి అవన్నీ మరచిపోయేదాన్ని. ప్రభాస్ ని చూసినప్పుడల్లా.. చాలా ఆనందంగా అనిపిస్తుంది. ప్రభాస్ మా అందరికీ  గొప్ప ప్రేరణ.” అంటూ ప్రభాస్‌పై తనకున్న అభిమానాన్ని వెల్లడించారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus
Tags