ఆల్లు అర్జున్ (Allu Arjun) నటించిన పుష్ప 2: ది రూల్ (Pushpa 2: The Rule) బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేసింది. దేశవ్యాప్తంగానే కాదు, ప్రపంచ వ్యాప్తంగా కూడా ఈ సినిమా భారీ వసూళ్లు సాధించడమే కాకుండా ప్రేక్షకులను మంత్ర ముగ్ధుల్ని చేసింది. సినిమా విజయాన్ని ప్రత్యేకంగా సెలబ్రేట్ చేసుకునే ఉద్దేశంతో అల్లు అర్జున్ అభిమానుల కోసం ఒక భారీ విజయ యాత్రను ప్లాన్ చేస్తున్నారు. పుష్ప 2 విడుదలకు ముందు జరిగిన ప్రమోషన్లలో బన్నీకి అభిమానుల నుంచి వచ్చిన స్పందన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
అతని ప్రతి అడుగు అభిమానుల గుండెల్లో దృఢంగా ముద్ర వేసింది. ఇప్పుడు, సినిమా ప్రపంచవ్యాప్తంగా 1000 కోట్ల గ్రాస్ వసూళ్లను దాటిన సందర్భంగా, ఈ విజయాన్ని మరింత గ్రాండ్‌గా సెలబ్రేట్ చేయడానికి బన్నీ మరో సారి తన అభిమానులను కలుసుకోబోతున్నారు. ఈ విజయ యాత్రలో ముంబై, ఢిల్లీ, చెన్నై, బెంగళూరు వంటి ప్రధాన నగరాలను సందర్శించనున్నారు.
ఈ కార్యక్రమాల్లో బన్నీ ప్రత్యేకంగా అభిమానులతో మాట్లాడేందుకు కూడా సమయం కేటాయించబోతున్నారు. సినిమా విజయానికి అభిమానులే ప్రధాన కారణమని భావించే అల్లు అర్జున్, వారి ప్రేమకు కృతజ్ఞతలు తెలిపేందుకు తాను పర్సనల్‌గా హాజరవుతున్నట్లు తెలుస్తోంది. ఈ విజయయాత్ర చివరగా హైదరాబాద్‌లో గ్రాండ్ ఈవెంట్‌తో ముగియనుంది. ఈ ఈవెంట్‌లో సినిమా టీమ్ అలాగే, పుష్ప 2 విజయం వెనుక ఉన్న ప్రతి వ్యక్తికి బన్నీ ప్రత్యేకంగా అభినందనలు చెప్పనున్నారని సమాచారం.
ఈ కార్యక్రమానికి సినీ ప్రముఖులతో పాటు, అభిమానులు కూడా భారీ సంఖ్యలో హాజరయ్యే అవకాశం ఉంది. పుష్ప 2 విజయంతో అల్లు అర్జున్ తన కెరీర్‌ను కొత్త ఎత్తుకి తీసుకెళ్లడం మాత్రమే కాదు, టాలీవుడ్ స్థాయిని ప్రపంచవ్యాప్తంగా చాటించడంలో సక్సెస్ అయ్యారు. ఈ విజయం తరువాత బన్నీ రాబోయే ప్రాజెక్టులపై అంచనాలు భారీగా పెరిగాయి.