టాలీవుడ్లో హీరోయిన్ల కొరత మత్రమే కాదు కమెడియన్ల కొరత కూడా ఏర్పడినట్టు కనిపిస్తుంది. బ్రహ్మానందం (Brahmanandam) హవా అయిపోయింది. ఒకప్పటి స్టార్ కమెడియన్స్ ధర్మవరపు (Dharmavarapu Subramanyam) , మల్లికార్జున్ (Mallikarjuna Rao) , ఏవీఎస్ (AVS) , ఎం.ఎస్.నారాయణ (M. S. Narayana) వంటి వారు కాలం చేసి చాలా కాలం అయ్యింది. అలాంటి కమెడియన్లు శ్రీను వైట్ల (Srinu Vaitla) వంటి కొంతమంది స్టార్ డైరెక్టర్స్ కి ప్లస్ పాయింట్స్ గా ఉండేవారు. బ్రహ్మానందం, అలీ (Ali) వంటి వారు ఫేడౌట్ అయిపోవడం వల్ల.. వాళ్ళకి పెద్దగా మంచి ఆఫర్స్ రావడం లేదు.
‘రామబాణం’ (Ramabanam) ‘డబుల్ ఇస్మార్ట్’ వంటి సినిమాల్లో అలీ కామెడీ తేలిపోయింది. వెన్నెల కిషోర్ (Vennela Kishore) బిజీగా గడుపుతున్నాడు కానీ పూర్తిస్థాయిలో రాణించడం లేదు. సరిగ్గా ఇలాంటి టైంలో సత్య లైమ్ లైట్లోకి వచ్చాడు. ‘మత్తు వదలరా 2’ (Mathu Vadalara 2) సినిమాతో సత్య (Satya) స్టార్ అయిపోయాడు. ఈ ఒక్క సినిమాతో అతని రేంజ్ అమాంతం పెరిగిపోయింది. దీంతో పారితోషికం కూడా గట్టిగా డిమాండ్ చేస్తున్నట్లు వినికిడి. అందుతున్న సమాచారం ప్రకారం.. సత్య ఒక్క రోజుకి గాను రూ.3 లక్షలు డిమాండ్ చేస్తున్నాడట. ఇటీవల ఓ పెద్ద బ్యానర్లో సినిమాకి..
ఒక్క రోజుకి గాను రూ.3.5 లక్షలు డిమాండ్ చేశాడట. అంతేకాదు సెపరేట్ కార్ వ్యాన్ కూడా డిమాండ్ చేస్తున్నాడట. సత్య అడిగిన దానికి నిర్మాతలు కూడా హ్యాపీగా ఎస్ చెప్పేస్తున్నారట. ప్రస్తుతం ఇతని చేతిలో పది సినిమాల వరకు ఉన్నాయట. ఇతని తర్వాత రాజ్ కుమార్ కసిరెడ్డి (Rajkumar Kasireddy) కూడా గట్టిగా డిమాండ్ చేస్తునట్టు వినికిడి. ఇక ఇప్పుడిప్పుడే బిజీ అవుతున్న ప్రసాద్ బెహరా కూడా ఒక రోజుకు లక్ష, లక్షన్నర డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. సత్య కాల్షీట్లు కనుక దొరక్కపోతే నెక్స్ట్ ఆప్షన్ గా ఆ ఇద్దరూ ఉన్నట్టు సమాచారం.