Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Featured Stories » మెగాస్టార్ మారలేదు, ఆయన మీద మాకున్న అభిమానమూ మారలేదు

మెగాస్టార్ మారలేదు, ఆయన మీద మాకున్న అభిమానమూ మారలేదు

  • August 22, 2018 / 06:48 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

మెగాస్టార్ మారలేదు, ఆయన మీద మాకున్న అభిమానమూ మారలేదు

మా అమ్మ అంటూ ఉండేది.. “ఏంట్రా ఈ సినిమా పిచ్చి. తిండి పెడతాయా, ఉద్యోగాలిస్తాయా. అయినా ఆ హీరో అంటే అంత వెర్రి అయితే ఎలారా. ఇట్టా మీ కుర్రాళ్ళంతా హీరోల వెంటపడతారు కాబట్టే భవిష్యత్తులో ఏమవుతారో అని భయంగా ఉంది. ఎప్పుడు మారతారో ఎంటో”.

నా మనసులో నాకు మాత్రమే వినిపించేది.. “అమ్మా, నువ్వు నా మీద ప్రేమతో తిట్టే ఆ హీరో నన్నెప్పుడు నీ భవిష్యత్తు పణంగా పెట్టి అభిమానించు అని చెప్పలేదు. ఆ మాట కొస్తే నీ పెంపకంలో నేను దారి తప్పుతాను అని ఎలా అనుకుంటావ్. అభిమానం ఆ హీరోకైతే జీవితం నీకేగా”

నేను టీనేజ్ లో అడుగు పెట్టినప్పటి నుంచి చిరంజీవి సినిమా విడుదలైన ప్రతిసారి నాకు ఈ ఆత్మీయ సంఘర్షణ తప్పేది కాదు. ఎలా మొదలైందో ఎవరు నేర్పించారో నాకు గుర్తులేదు. కాని ఆయనంటే క్రేజ్ 9 ఏళ్ల వయసు ఉన్నప్పుడు మొదలైతే “అన్నయ్య”తో పీక్స్ కు వెళ్ళిపోయింది. అది మొదలు “డాడీ, ఇంద్ర, ఠాగూర్” చూసి చూసి కంటికి సైట్ వచ్చిందే కాని చిరు సినిమాలో ట్రీట్ మాత్రం నాకు ఎప్పటికప్పుడు కొత్తగా అనిపించేది. ఆఖరికి అట్టర్ ఫ్లాప్ అని యాంటీ ఫ్యాన్స్ ఊరంతా ప్రచారం చేసిన (వాళ్ళు చెప్పింది నిజమే) “స్టాలిన్” సినిమాని కూడా సీడీ అరిగిపోయేదాకా ఎన్ని సార్లు చూసానో లెక్క లేదు. అభిమానం కళ్ళల్లో నిండినప్పుడు నిజాలు కూడా అనుమానంగానే అనిపిస్తాయి.

నేను ఒక్కడినే కాదు. నా ఫ్రెండ్స్ సర్కిల్లో అందరూ చిరు ఫ్యాన్స్ కావడమే మాకందరికి ప్రెస్టీజ్ లాగా అనిపించేది. “శంకర్ దాదా జిందాబాద్” సినిమా చూసి వచ్చాక బయట అందరూ బాలేదని తిట్టి పోస్తుంటే అదేదో నన్నే అన్న ఫీలింగ్ వల్ల మనస్థాపంతో కొన్ని రోజులు అన్నం సహించకపోవడం నాకు ఇంకా బాగా గుర్తే. “అందరివాడు” కలెక్షన్స్ తగ్గాయని అందరూ మాట్లాడుకుంటూ ఉంటే ఆ థియేటర్ ఉన్న ఏరియాకు కూడా వెళ్ళే ధైర్యం చేయలేదు.

చిరంజీవి ఫోటోలు ఉన్న గ్రీటింగ్ కార్డులు, లేబుల్స్, పోస్టర్స్, సినిమా మ్యాగజైన్స్ ఎన్ని కొన్నానో ఆ డబ్బులు ఎక్కడినుంచి వచ్చేవో ఓ కోటి రూపాయలు ఇచ్చి చెప్పమన్నా విక్రమార్కుడు కూడా చెప్పలేడు. సెకండ్ రిలీజ్ లో కూడా పసివాడి ప్రాణం, ఖైదీ నెంబర్ 786, కొండవీతో రాజా, రాక్షసుడు, విజేత లాంటి సినిమాలు హౌస్ ఫుల్ తో నడుస్తుంటే ఫుడ్ లేకుండా కడుపు నిండిన ఫీలింగ్. ఇది మాటల్లో వర్ణించేది కాదు.
అసలు చిరంజీవిని ఎందుకు ఇష్టపడ్డావ్ అంటే నేను చెప్పే కారణాల కోసం బుక్కే రాయాల్సి వస్తుంది. అకేషన్ కాబట్టి సముద్రాన్ని చిన్న పోస్ట్ లో వర్ణించే ప్రయత్నం చేసాను. ఎందరో అభిమానులు పుస్తకాలు రాసారు, పూనకాలు పోయారు,సంఘాలు పెట్టారు, రక్తదానాలు చేశారు ఎన్నో ఎన్నెన్నో. నేను దేనిలోను లేను. నాది మౌనాభిమానం. ఏం చేద్దాం. నాకు మౌనారాధనే ఇష్టం. స్టేట్ రౌడి, రుద్రనేత్ర, త్రినేత్రుడు సినిమాల్లో స్టెప్స్ చూసి సంవత్సరాల కొద్దీ ఒంటరిగా రూంలోనే ప్రాక్టీస్ చేయటం నాకు, మేము మారిన ఇళ్లల్లో గోడలకు మాత్రమే తెలిసిన రహస్యం. అల్మారా మొత్తం ఆడియో కేసెట్లతో నిండిపోతే తన సంపాదనలో సగం ఇలా ఈ రూపంలో చిరంజీవే లాగేసుకుంటున్నాడు అని నాన్న ఎన్నిసార్లు అన్నారో లెక్కబెట్టడం కష్టం.

ఇక స్కూల్ వయసు మొదలుకొని కాలేజ్ దాకా టీచర్లతో కూడా ఇదే విషయం గురించి తిట్లు తినడం కూడా తీయగానే ఉండేది. చిరు సినిమాల్లో కనిపించే షర్టుల కోసం బజార్ లో షాపులు మొత్తం వెతికిన జ్ఞాపకాలు కోకొల్లలు. థియేటర్ బయట పెట్టే కట్ ఔట్ చూడడానికి సైకిల్ వేసుకుని ఎన్ని రౌండ్స్ వేశామో తలుచుకుంటే ఇప్పటికీ తీయగా అనిపిస్తుంది.

చిరు అనే సమ్మోహన శక్తి గురించి చెప్పుకుంటూ పోతే నా కీబోర్డ్ మార్చాల్సి వస్తుంది. ఇది చిరుతో అనుబంధం గురించి నేను బుక్ లాంటి ప్రయత్నం చేస్తే అందులో ఓ రెండు పేజీలు మాత్రమే ఇక్కడ మీ ముందు ఉంచాను. ఇది నా ఒక్కడిదే కాదు అందరి అభిమానుల కథ. మొదట్లో అమ్మ దేని గురించి అయితే దిగులు పడిందో ఈ రోజు అదే సినిమా నేను తినే తిండికి ఒక కారణమైంది. నా ఉద్యోగ ప్రస్థానంలో ఒక మజిలీగా మారింది. కారణం ఎవరో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.

గత సంక్రాంతికి అమ్మానాన్నతో కలిసి ఫ్యామిలీ మొత్తం ఖైదీ నెంబర్ 150 చూసి బయటకు వస్తుండగా అమ్మ అంది.. “ఏంట్రా ఇది. మీరు మారారు, లైఫ్ లో సెటిల్ అయ్యారు, స్వంతంగా ఫ్యామిలీ వచ్చి చేరింది, బాధ్యతలు పెరిగాయి. కానీ మీ హీరో మాత్రం అలాగే ఎలా ఉన్నాడురా. అప్పటి లాగే ఇంత ఈజ్ తో ఆ డాన్సులు ఎలా చేసాడ్రా. మొహంలో వర్చసుతో మాయ చేయటం ఆయనకు సాధ్యమైనట్టు ఇంకెవరికి కాదు. గొప్పోడురా బాబు”.
ఇప్పుడు కూడా మనసులోనే అనుకున్నా.. “ఆయన మారడు, మా అభిమానం మారదు. ఇది ఇంతే”

– మెగా అభిమాని

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Chiranjeevi
  • #Chiranjeevi 151 Film
  • #Chiranjeevi Birthday
  • #Chiranjeevi Fans
  • #Mega Fans

Also Read

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

NBK111 X King100: క్రిస్మస్‌కి  బాలయ్య వర్సెస్ నాగార్జున

NBK111 X King100: క్రిస్మస్‌కి బాలయ్య వర్సెస్ నాగార్జున

Yeshanagula: ‘యేష నాగుల’ కి నేషనల్ అవార్డ్.. సాధ్యమేనా?

Yeshanagula: ‘యేష నాగుల’ కి నేషనల్ అవార్డ్.. సాధ్యమేనా?

Irumudi Collections: 8వ రోజు కూడా మాస్ కుమ్ముడు.. ‘ఇరుముడి’ టోటల్ కలెక్షన్స్ అండ్ ప్రాఫిట్స్ డీటెయిల్స్

Irumudi Collections: 8వ రోజు కూడా మాస్ కుమ్ముడు.. ‘ఇరుముడి’ టోటల్ కలెక్షన్స్ అండ్ ప్రాఫిట్స్ డీటెయిల్స్

Nagarjuna: బర్త్‌ డే స్పెషల్‌: నాగార్జున.. ఎన్ని ప్రయోగాలు చేశారో తెలుసా? ఏ హీరో కూడా..

Nagarjuna: బర్త్‌ డే స్పెషల్‌: నాగార్జున.. ఎన్ని ప్రయోగాలు చేశారో తెలుసా? ఏ హీరో కూడా..

Toxic Movie Collections: అక్కడ తప్ప… మిగిలిన అన్ని చోట్లా డౌన్ అయిన ‘టాక్సిక్’ కలెక్షన్స్

Toxic Movie Collections: అక్కడ తప్ప… మిగిలిన అన్ని చోట్లా డౌన్ అయిన ‘టాక్సిక్’ కలెక్షన్స్

related news

Chiranjeevi: చిరంజీవి ‘ఇరుమడి’ పోస్టుపై ఇన్ని చర్చలు అవసరమా.. ఓర్వలేనితనం కాకపోతే

Chiranjeevi: చిరంజీవి ‘ఇరుమడి’ పోస్టుపై ఇన్ని చర్చలు అవసరమా.. ఓర్వలేనితనం కాకపోతే

Chiranjeevi: ఆయన చివరి ఆలోచనలు నాతో పంచుకున్నారేమో: చిరంజీవి భావోద్వేగం

Chiranjeevi: ఆయన చివరి ఆలోచనలు నాతో పంచుకున్నారేమో: చిరంజీవి భావోద్వేగం

Gv Narayana Rao: ప్రముఖ నటుడు, చిరంజీవి స్నేహితుడు కన్నుమూత

Gv Narayana Rao: ప్రముఖ నటుడు, చిరంజీవి స్నేహితుడు కన్నుమూత

Kaaka: ‘కాకా’ టీజర్‌లో ఈ అంశాలు గమనించారా? చాలానే చూపించారు!

Kaaka: ‘కాకా’ టీజర్‌లో ఈ అంశాలు గమనించారా? చాలానే చూపించారు!

Thaman: పాత పాటల్ని కలిపేస్తా.. అదరగొట్టేస్తా.. తమన్‌ కొత్త స్ట్రాటజీ అదుర్స్‌

Thaman: పాత పాటల్ని కలిపేస్తా.. అదరగొట్టేస్తా.. తమన్‌ కొత్త స్ట్రాటజీ అదుర్స్‌

Raaka – Kaaka: ‘రాకా’.. ‘కాకా’.. నెక్స్ట్‌ ఏంటి?

Raaka – Kaaka: ‘రాకా’.. ‘కాకా’.. నెక్స్ట్‌ ఏంటి?

trending news

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

1 day ago
NBK111 X King100: క్రిస్మస్‌కి  బాలయ్య వర్సెస్ నాగార్జున

NBK111 X King100: క్రిస్మస్‌కి బాలయ్య వర్సెస్ నాగార్జున

1 day ago
Yeshanagula: ‘యేష నాగుల’ కి నేషనల్ అవార్డ్.. సాధ్యమేనా?

Yeshanagula: ‘యేష నాగుల’ కి నేషనల్ అవార్డ్.. సాధ్యమేనా?

1 day ago
Irumudi Collections: 8వ రోజు కూడా మాస్ కుమ్ముడు.. ‘ఇరుముడి’ టోటల్ కలెక్షన్స్ అండ్ ప్రాఫిట్స్ డీటెయిల్స్

Irumudi Collections: 8వ రోజు కూడా మాస్ కుమ్ముడు.. ‘ఇరుముడి’ టోటల్ కలెక్షన్స్ అండ్ ప్రాఫిట్స్ డీటెయిల్స్

1 day ago
Nagarjuna: బర్త్‌ డే స్పెషల్‌: నాగార్జున.. ఎన్ని ప్రయోగాలు చేశారో తెలుసా? ఏ హీరో కూడా..

Nagarjuna: బర్త్‌ డే స్పెషల్‌: నాగార్జున.. ఎన్ని ప్రయోగాలు చేశారో తెలుసా? ఏ హీరో కూడా..

1 day ago

latest news

Tollywood: థియేటర్‌ వైబ్‌ కావాలా.. హిట్‌ ‘సింగిల్‌’తో తీసుకొచ్చేయ్‌..

Tollywood: థియేటర్‌ వైబ్‌ కావాలా.. హిట్‌ ‘సింగిల్‌’తో తీసుకొచ్చేయ్‌..

1 day ago
KING 100: గ్లింప్స్‌లో ఈ విషయాలు మీరు గమనించారా?

KING 100: గ్లింప్స్‌లో ఈ విషయాలు మీరు గమనించారా?

1 day ago
Purna: ‘జైలర్‌ 2’ పాట.. చాలా పోటీ ఉన్నా పూర్ణకే ఎందుకొచ్చిందంటే…

Purna: ‘జైలర్‌ 2’ పాట.. చాలా పోటీ ఉన్నా పూర్ణకే ఎందుకొచ్చిందంటే…

1 day ago
Toxic: ‘టాక్సిక్’ విషయంలో ‘సాహో’ సీన్ రిపీట్ అయ్యిందా?

Toxic: ‘టాక్సిక్’ విషయంలో ‘సాహో’ సీన్ రిపీట్ అయ్యిందా?

1 day ago
Murugadas And Shankar: మురుగుదాస్‌.. శంకర్‌ కాంబో.. హీరో ఎవరో మరి?

Murugadas And Shankar: మురుగుదాస్‌.. శంకర్‌ కాంబో.. హీరో ఎవరో మరి?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version