Actress Pavani Reddy: సర్జరీ చేయించుకున్న టాలీవుడ్ నటి.. ఏమైందంటే?

ప్రముఖ టాలీవుడ్ నటికి పెద్ద సర్జరీ జరిగిందట. ఈ వార్త ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. వివరాల్లోకి వెళితే.. నటి పావని రెడ్డి అందరికీ సుపరిచితమే. తెలుగులోనే కాకుండా తమిళ,మలయాళ భాషల్లో పలు సీరియల్స్ తో బాగా పాపులర్ అయ్యింది. ప్రస్తుతం బిజీ ఆర్టిస్ట్ గా రాణిస్తున్న ఈమె అనుకోకుండా హాస్పిటల్ పాలైంది. 15 రోజుల నుండి ఆమె హాస్పిటల్లోనే ఉందట. ఈ విషయాన్ని స్వయంగా ఆమెనే చెప్పుకొచ్చింది. ఈ విషయం గురించి పావని రెడ్డి స్పందిస్తూ.. “ఈ 15 రోజులు అత్యంత దారుణంగా గడిచాయి. మొదట నాకు మెడ దగ్గర చిన్న నొప్పిగా మొదలైంది.

తర్వాత అది రోజు రోజుకు పెరుగుతూ వచ్చింది. నేను ఎంతో మంది వైద్యులను సంప్రదించాను. కానీ నొప్పి తగ్గలేదు. దీని వల్ల చాలా ఇబ్బందులకు గురయ్యాను. నిద్రలేని రాత్రులు ఎన్నో గడిపాను. అంతేకాదు నిద్రపోకుండా ఏడ్చిన సందర్భాలు కూడా అనేకం ఉన్నాయి. ఈ క్రమంలో ఏషియన్ స్పైన్ హాస్పిటల్లో చేరాను.నాకు ఎండోస్కోపిక్ డిసెక్టమీ సర్జరీ చేశారు. ఇప్పుడు ప్రశాంతంగా ఉంది. డాక్టర్లకు నా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఈ రోజు డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉంది.

ఈ కష్ట సమయంలో తోడుగా నిలిచిన నా కుటుంబ సభ్యులకి, మిత్రులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను” అంటూ ఆమె చెప్పుకొచ్చింది. 2016లో పావని మరో తెలుగు నటుడు ప్రదీప్ కుమార్ ను ప్రేమించి .. 2017, ఫిబ్రవరి 14న ప్రేమికుల రోజు నాడు పెళ్లి చేసుకుంది. అయితేప్రదీప్ 2017 మే 17న హైదరాబాద్‌లోని తన నివాసంలో ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు విడిచాడు. అటు తర్వాత ఈమె (Actress Pavani Reddy) తమిళ సీరియల్స్ లో మాత్రమే నటిస్తూ వస్తోంది.

పలు సినిమాల్లో కూడా నటిస్తూ వస్తోంది. కొన్నాళ్ల క్రితం ఈమె తమిళ కొరియోగ్రాఫర్ అమీర్ ఎడిసన్‌తో లవ్ లో పడింది. ప్రస్తుతం ఇద్దరూ డేటింగ్ లో ఉన్నారు. పావని సర్జెరీ చేయించుకోవడానికి హాస్పిటల్ లో చేరినప్పటి నుండి అతను కూడా హాస్పిటల్లోనే ఉంటూ ఆమెకు సేవలు చేస్తూ వచ్చాడట.

రంగబలి సినిమా రివ్యూ & రేటింగ్!

రుద్రంగి సినిమా రివ్యూ & రేటింగ్!
18 స్టార్ హీరోయిన్ల చిన్ననాటి రేర్‌ ఫోటోలు వైరల్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus