సాధారణంగా ఏ స్టార్ హీరో అయినా తను నటించిన రెండు సినిమాలను ఒకేరోజు రిలీజ్ చేయాలని భావించడు. ఒకేరోజు ఒకే హీరో నటించిన రెండు సినిమాలు రిలీజైతే కలెక్షన్లపై ప్రభావం పడుతుందనే సంగతి తెలిసిందే. అయితే 1993 సంవత్సరంలో బాలకృష్ణ నటించిన నిప్పురవ్వ, బంగారు బుల్లోడు సినిమాలు సెప్టెంబర్ 13వ తేదీన రిలీజయ్యాయి. కోదండ రామిరెడ్డి డైరెక్షన్ లో యువరత్న ఆర్ట్స్ బ్యానర్ పై బాలకృష్ణ నిర్మాతగా నిప్పురవ్వ మూవీ తెరకెక్కింది.
విజయశాంతి, శోభన ఈ సినిమాలో హీరోయిన్లుగా నటించగా ఈ సినిమాలోని పాటలు హిట్టయ్యాయి. ఈ సినిమాకు నలుగురు సంగీత దర్శకులు పని చేయగా ఆడియో రిలీజైన తొలిరోజే ఈ సినిమా ఆడియో క్యాసెట్లు లక్షకు పైగా అమ్ముడయ్యాయి. వేర్వేరు కారణాల వల్ల ఈ సినిమా షూటింగ్ ఆలస్యం కావడంతో బంగారు బుల్లోడు సినిమా రిలీజైన రోజునే ఈ సినిమాను కూడా రిలీజ్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే బంగారు బుల్లోడు సక్సెస్ సాధిస్తే నిప్పురవ్వ మాత్రం ప్రేక్షకులను పెదగా ఆకట్టుకోలేదు.
హీరో నాని నటించిన జెండాపై కపిరాజు, ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాలు కూడా ఒకేరోజు విడుదల కాగా ఎవడే సుబ్రహ్మణ్యం హిట్ గా నిలిస్తే జెండాపై కపిరాజు ఫ్లాప్ గా నిలిచింది. 1993లో బాలయ్య, 2015లో నాని నటించిన సినిమాలు ఒకేరోజు రిలీజ్ కావడంతో పాటు ఒక సినిమా హిట్ గా నిలిస్తే మరో సినిమా ఫ్లాప్ గా నిలిచింది. బాలయ్య, నాని కెరీర్ లో ఒకేరోజు రెండు సినిమాలు రిలీజ్ కావడం అరుదైన ఫీట్ అని చెప్పవచ్చు.
Most Recommended Video
నవరస వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
ఎస్.ఆర్.కళ్యాణమండపం సినిమా రివ్యూ & రేటింగ్!
క్షీర సాగర మథనం సినిమా రివ్యూ & రేటింగ్!