Sreeleela: శ్రీలీల ఖాతాలో ఇప్పటి వరకు ఏ హీరోయిన్ కి దక్కని రికార్డ్..!

టాలీవుడ్ చిత్ర పరిశ్రమంలో ఎంతో మంది హీరోయిన్లు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు. కానీ అందులో… కొంతమంది మాత్రమే సక్సెస్ అవుతారు. అలా సక్సెస్ అయిన వారిలో హీరోయిన్ శ్రీ లీల ఒకరు. హీరోయిన్ శ్రీ లీల గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. పెళ్లి సందడి సినిమాతో ఇండస్ట్రీలు అడుగుపెట్టిన హీరోయిన్ శ్రీ లీల… ఆ తర్వాత వెనక్కి చూసుకోలేదు. ఈ సినిమా పెద్దగా సక్సెస్ కాకపోయినా రవితేజ హీరోగా చేసిన ధమాకా సినిమాతో బంపర్ విజయాన్ని అందుకుంది హీరోయిన్ శ్రీ లీల.

ధమాకా సినిమా తర్వాత ఇండస్ట్రీలో దాదాపు 8 నుంచి 10 సినిమాలను లైన్లో పెట్టింది ఈ బ్యూటీ. ఇక ఇటీవల బాలయ్య చేసిన భగవంతు కేసరిలోనూ అద్భుతంగా నటించి అందర్నీ మెప్పించింది. కాగా రీసెంట్గా నటించిన ఆది కేశవ కూడా బాక్సాఫీస్ వద్ద మంచి హిట్ టాక్ అందుకుంది . ఇలాంటి క్రమంలోనే శ్రీలీలకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతుంది. శ్రీలీల నితిన్ ఎక్స్ ట్రా అర్డినరీ సినిమాలో ఓ మాస్ మసాల సాంగ్ చేయబోతుందట.

అంతేకాదు ఈ సాంగ్ కోసం (Sreeleela) శ్రీ లీలా బాగా కష్టపడుతుందట . శంషాబాద్ లో స్పెషల్ గా నిర్మించిన సెట్లో ఈ సాంగ్ షూటింగ్ జరుగుతుందట . ఈ పాట కోసం దాదాపు 300 మందికి పైగా ఫిమేల్ డాన్సర్లు స్టెప్పులెస్తున్నట్లు తెలుస్తుంది. ఇప్పటివరకు సినిమా ఇండస్ట్రీలో ఏ హీరోయిన్ కూడా ఇలా 300 మంది ఫిమేల్ డాన్సర్లతో ఆడి పాడి చిందేసింది లేదు . ఆ ఘనత అందుకున్న హీరోయిన్ గా శ్రీలీల రికార్డులు క్రియేట్ చేయబోతుంది . ఈ సాంగ్ను డాన్స్ మాస్టర్ జానీ మాస్టర్ కొరియోగ్రఫీ చేయబోతున్నారు.

ఆదికేశవ్ సినిమా రివ్యూ & రేటింగ్!

కోట బొమ్మాళీ పి.ఎస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సౌండ్ పార్టీ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus