పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా సాగర్ కె చంద్ర డైరెక్షన్ లో తెరకెక్కిన భీమ్లా నాయక్ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. సంక్రాంతికే రిలీజ్ కావాల్సిన ఈ సినిమా వేర్వేరు కారణాల వల్ల శివరాత్రికి వాయిదా పడింది. ఏపీలో టికెట్ రేట్లు పెరగని పక్షంలో, 50 శాతం ఆక్యుపెన్సీ నిబంధనలు సడలించని పక్షంలో ఈ సినిమా ఏప్రిల్ 1వ తేదీన రిలీజ్ కానుందని వార్తలు జోరుగా ప్రచారంలోకి వచ్చాయి.
అయితే ఏపీలో గత కొన్నిరోజుల నుంచి 2,000 లోపే కరోనా కేసులు నమోదవుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ నెల 15వ తేదీ నుంచి నైట్ కర్ఫ్యూతో పాటు 50 శాతం ఆక్యుపెన్సీ నిబంధనల సడలింపు దిశగా అడుగులు వేసే ఛాన్ ఉంది. మరోవైపు ఒకటి లేదా రెండు రోజుల్లో ఏపీలో టికెట్ రేట్లు పెరిగే అవకాశంతో పాటు బెనిఫిట్ షోలకు కూడా అనుమతులు లభించే అవకాశాలు అయితే ఉన్నాయని సమాచారం.
మరోవైపు భీమ్లా నాయక్ సినిమాకు ఊహించని స్థాయిలో ప్రీ రిలీజ్ బిజినెస్ జరుగుతోందని బోగట్టా. అభిమానులు ఈ సినిమాను ఫిబ్రవరి 25వ తేదీనే విడుదల చేయాలని సోషల్ మీడియాలో హ్యాష్ ట్యాగ్ లను వైరల్ చేస్తున్నారు. భీమ్లా నాయక్ సినిమా ఫిబ్రవరి 25వ తేదీనే రిలీజవుతుందని థియేటర్లను బ్లాక్ చేయాలని నిర్మాతల నుంచి భీమ్లా నాయక్ సినిమా డిస్ట్రిబ్యూటర్లకు సమాచారం అందిందని తెలుస్తోంది. భీమ్లా నాయక్ మేకర్స్ త్వరలోనే ఈ సినిమాను ఫిబ్రవరి 25వ తేదీన రిలీజ్ చేయనున్నామని ప్రకటన చేసే ఛాన్స్ అయితే ఉంది.
వకీల్ సాబ్ తర్వాత పవన్ నటించి విడుదలవుతున్న సినిమా ఇదే కావడం గమనార్హం. పవన్ కు జోడీగా ఈ సినిమాలో నిత్యామీనన్ నటించారు. 120 కోట్ల రూపాయలకు పైగా బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కగా త్వరలో ఈ సినిమా నుంచి థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ కానుంది.
Most Recommended Video
బ్రహ్మానందం కామెడీతో హిట్టైన 10 సినిమాల లిస్ట్..!
తమిళంలో సత్తా చాటిన తెలుగు సినిమాలు … టాప్ 10 లిస్ట్ ఇదే ..!
అంతా ఓకే అయ్యి ఆగిపోయిన చిరంజీవి సినిమాలివే!