Simhadri Movie: ఎన్టీఆర్ చెయ్యాల్సిన ఆ సినిమా ఆగిపోతే.. ‘సింహాద్రి’ చేయించారట..!

20 ఏళ్ళ వయసు లోపే ఎన్టీఆర్ పెద్ద స్టార్ హీరో అయిపోయాడు అంటే రాజమౌళి తెరకెక్కించిన ‘సింహాద్రి’ వల్లే అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ చిత్రం 151 కేంద్రాల్లో 100 రోజులు ఆడింది.అంతేకాదు 55 కేంద్రాల్లో 175రోజులు కూడా ఆడి సరికొత్త రికార్డ్ సృష్టించింది . ఈ చిత్రం వచ్చి 17ఏళ్ళు పూర్తయ్యింది. అయితే ‘సింహాద్రి’ మొదలవ్వడానికి ముందే కొన్ని ఊహించని సంఘటనలు చోటు చేసుకున్నాయట. ఓ పక్క ‘ఆది’ చిత్రం షూటింగ్ దశలో ఉండగానే.. ‘సింహాద్రి’ నిర్మాతలు అయిన వి.ఎం.సి(విజయ మారుతీ క్రియేషన్స్) వారు ఎన్టీఆర్ తో ఓ చిత్రాన్ని మొదలు పెట్టారట.

కాలేజ్ బ్యాక్ డ్రాప్ లో సాగే లవ్ స్టోరీ కథాంశంతో ఆ చిత్రం సాగుతుందట. ఆ చిత్రం షూటింగ్ సగం వరకూ పూర్తయ్యిందట. అదే టైములో వినాయక్ డైరెక్షన్లో తెరకెక్కిన ‘ఆది’ చిత్రం విడుదలయ్యి బ్లాక్ బస్టర్ అయ్యింది.అంతేకాదు ఎన్టీఆర్ కు మాస్ ఇమేజ్ తెచ్చిపెట్టిన చిత్రం అది. అయితే ఆ చిత్రాన్ని చూసిన ‘వి.ఎం.సి’ వారికి టెన్షన్ మొదలైంది. వారు నిర్మిస్తున్న చిత్రంలో మాస్ ఎలిమెంట్స్ లేవు.

‘ఆది’ తో ఎన్టీఆర్ కు వచ్చిన ఇమేజ్ కు వారు నిర్మించే సినిమా మ్యాచ్ అవ్వదు అని ముందే పసిగట్టేసారు. వెంటనే వారు నిర్మిస్తున్న షూటింగ్ ను ఆపేసారట. సరిగ్గా అదే సమయంలో ఎన్టీఆర్ కు ‘స్టూడెంట్ నెంబర్ 1’ చిత్రంతో మొదటి హిట్ ఇచ్చిన రాజమౌళి సీన్లోకి ఎంట్రీ ఇచ్చాడు. తన తండ్రి విజయేంద్ర ప్రసాద్ తో రెడీ చేయించిన ‘సింహాద్రి’ స్క్రిప్ట్ ను వారికి వినిపించి.. ప్రాజెక్టు ను పట్టాలెక్కించాడు. అలా ‘సింహాద్రి’ మొదలై విజయవంతం అయ్యిందని తెలుస్తుంది.

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

Most Recommended Video

చిరంజీవి, బాలకృష్ణలు తలపడిన 15 సందర్భాలు!
తమ ఫ్యామిలీస్ తో సీరియల్ ఆర్టిస్ట్ ల.. రేర్ అండ్ అన్ సీన్ పిక్స్..!
ఇప్పటివరకూ అత్యధిక కలెక్షన్లను రాబట్టిన తెలుగు సినిమాలు ఇవే!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus