Adipurush: ఆదిపురుష్ పై అయోధ్య పూజారుల సంచలన వ్యాఖ్యలు.. ఏమైందంటే?

ప్రభాస్ హీరోగా ఓం రౌత్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఆదిపురుష్ సినిమా విషయంలో విమర్శల పర్వం కొనసాగుతోంది. ఈ సినిమాను బ్యాన్ చేయాలంటూ కొంతమంది కామెంట్లు చేస్తుండగా ఆ కామెంట్లు సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అవుతున్నాయి. ఆదిపురుష్ సినిమాపై అయోధ్య పూజారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అయోధ్య పూజారులు ఆదిపురుష్ సినిమాపై విమర్శలు చేయగా ఆ విషయాలు వైరల్ అవుతున్నాయి. హనుమాన్ గర్హి ఆలయ పూజారి సీతారాములు, ఆంజనేయుని వేషాలకు సంబంధించి అభ్యంతరాలను వ్యక్తం చేయడం గమనార్హం.

హనుమంతుని పాత్రతో చెప్పించిన డైలాగ్స్ విషయంలో కొంతమంది వ్యతిరేకతను వ్యక్తం చేస్తున్నారు. రామజన్మభూమి ప్రధాన పూజారి ఆచార్య సత్యేంద్ర దాస్ ఆదిపురుష్ సినిమాను బ్యాన్ చేయాలని హనుమంతునితో చెప్పించిన డైలాగ్స్ సిగ్గుచేటని పేర్కొన్నారు. రాముడు, హనుమంతుడి పాత్రలను సినిమాలో పూర్తిస్థాయిలో మార్చి చూపించారని మనకు తెలిసిన రామాయణంలో ఉన్న పాత్రలలా ఆ పాత్రలు ఏ మాత్రం లేవని ఆయన అన్నారు.

బాలీవుడ్ ఇండస్ట్రీ హిందూ మతంను వక్రీకరించడానికి తాపత్రయపడుతోందని ఆదిపురుష్ విషయంలో ఎలాంటి శ్రద్ధ తీసుకోలేదని ఆయన చెప్పుకొచ్చారు. మరోవైపు ఆదిపురుష్ సినిమాకు సంబంధించి వివాదాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. ఆదిపురుష్ సినిమాకు సంబంధించిన వివాదాలు రాబోయే రోజుల్లో కొనసాగుతాయో ఆగిపోతాయో చూడాల్సి ఉంది. భవిష్యత్తులో మైథలాజికల్ సినిమాలలో నటించాలంటే హీరోలు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాల్సిన పరిస్థితి నెలకొంది.

ఆదిపురుష్ (Adipurush) సినిమా వివాదాల్లో చిక్కుకోవడం ప్రభాస్ అభిమానులను సైతం బాధ పెడుతోంది. ఆదిపురుష్ ఓటీటీలో విడుదలైన తర్వాత మరిన్ని విమర్శలను ఎదుర్కోవడం గ్యారంటీ అని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రామాయణాన్ని తనకు నచ్చిన విధంగా చూపించాలని ఓం రౌత్ తీసుకున్న నిర్ణయమే అతిపెద్ద మైనస్ అని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. ప్రభాస్ స్పందించి ఈ వివాదాలకు చెక్ పెడితే బాగుంటుందని కొంతమంది సోషల్ మీడియా వేదికగా అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.

ఆదిపురుష్ సినిమా రివ్యూ & రేటింగ్!

‘సైతాన్’ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
కుటుంబం కోసం జీవితాన్ని త్యాగం చేసిన స్టార్ హీరోయిన్స్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus