ఈ రోజుల్లో చిన్న సినిమా తీయడం ఈజీనే. కానీ ఆ చిన్న సినిమాని రిలీజ్ చేయడం అనేది చాలా కష్టమని దర్శకులు, నిర్మాతలు చెబుతూ ఉంటారు. వాళ్ల మాటల్లో వంద శాతం నిజం ఉంది. అందుకే చాలా చిన్న సినిమాలు రిలీజ్ కాకుండా ఆగిపోతున్నాయి. అదే చిన్న సినిమాకి… పెద్ద నిర్మాతలు సపోర్టు చేస్తే అది ఈజీగా రిలీజ్ అవ్వడం మాత్రమే కాదు .. ఆ చిన్న సినిమాకి పబ్లిసిటీ కూడా బాగా జరుగుతుంది.
అందుకే సామజవరగమన, హిడింబ , బలగం, కేరాఫ్ కంచెరపాలెం వంటి చిత్రాలు బయటకు వచ్చాయి. ఇంకా చాలా సినిమాలు బయటకు వచ్చినా సక్సెస్ అయినవి మాత్రం ఇవే. ఇదిలా ఉంచితే.. చిన్న సినిమాకి టికెట్ రేట్లు అందుబాటులో ఉండాలి. లేదు అంటే.. కలెక్షన్స్ ఆశించిన స్థాయిలో రావు. ఈ విషయంలో చిన్న సినిమా సఫర్ అవుతుంది. అయితే దీనికి ఒక మంచి పరిష్కారం వెతికింది ఒక చిన్న సినిమా యూనిట్.
వివరాల్లోకి వెళితే.. బాయ్స్ హాస్టల్ అనే సినిమా గత వారం రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకి మిక్స్డ్ టాక్ వచ్చింది. కొంతమంది బాగుంది అన్నారు.. ఇంకొంతమంది బాలేదు అన్నారు. అయితే యూత్ మాత్రం ఈ చిత్రం చూడడానికి ఎగబడుతున్నారు. అందుకే వీక్ డేస్ లో ఈ మూవీ కలెక్షన్స్ తగ్గకుండా ఓ తెలివైన నిర్ణయం తీసుకుంది చిత్ర బృందం.
ఆగస్టు 30 న (Boys Hostel) ‘బాయ్స్ హాస్టల్’ కి 1+1 ఆఫర్ పెట్టారు. అంటే ఒకటి కొంటే టికెట్ ఫ్రీ అనమాట. హైదరాబాద్ లోని అన్ని థియేటర్స్ తో పాటు ఆంధ్రలో కూడా కొన్ని థియేటర్స్ లో ఈ ఆఫర్ అందుబాటులోకి రానుంది.ఇది కనుక వర్కౌట్ అయితే.. చిన్న సినిమాల ఫిలిం మేకర్స్ ఇదే మార్గాన్ని అనుసరించే అవకాశాలు ఉన్నాయి.
మిడ్ రేంజ్ హీరోలు చేసిన ఈ 10 యాక్షన్ సినిమాలు భారీ నష్టాలు మిగిల్చాయని మీకు తెలుసా?
మెహర్ రమేష్ తో పాటు పెద్ద హీరోలు ఛాన్సులు ఇచ్చినా హిట్లివ్వలేకపోయిన డైరెక్టర్ల లిస్ట్.!
రామ్ నీ బాలయ్య ఏమని తిట్టాడో తెలిస్తే షాక్ అవుతారు..!