Bigg Boss 7 Telugu: క్లాక్ టాస్క్ లో గెలిచింది ఎవరు ? ఫినాలే టిక్కెట్ టాస్క్ లో ఏం జరిగిందంటే.?

బిగ్ బాస్ హౌస్ లో టిక్కెట్ టు ఫినాలే టాస్క్ మొదలైంది. రెండు వారాలు ఇంకా మిగిలి ఉండగానే హౌస్మేట్స్ టిక్కెట్ టు ఫినాలే కోసం పోటీ పడుతున్నారు. దీనివల్ల ఒకవారం ఇమ్యూనిటీతో పాటుగా ఫైనల్స్ లో టాప్ 5లో అడుగుపెట్టే అవకాశం ఉంటుంది. అందుకే, ప్రతి ఒక్కరూ ప్రాణం పెట్టి మీర ఆడుతున్నారు. ఇందులో భాగంగా బిగ్బాస్ మొత్తం 100 పాయింట్స్ కి ఒక్కో గేమ్ ని డిజైన్ చేశాడు. వాళ్లు ఆడిన పెర్ఫామన్స్ ని బట్టీ పాయింట్స్ ఇస్తాడు బిగ్ బాస్. లీస్ట్ లో ఉన్నవాళ్లు రేస్ నుంచీ తప్పుకుంటారు.

అలాగే, టాప్ లో ఉన్నవారు టిక్కెట్ గెలుచుకుంటారు. ఇక్కడే ఫస్ట్ టాస్క్ క్లాక్ టాస్క్ ప్రారంభం అయ్యింది. గడియారం ముళ్లు మనవైపు వచ్చినప్పుడల్లా జంప్ చేసి దానిని దాటాల్సి ఉంటుంది. ఒక్కొక్కరికి ఒక్కో బేస్మెంట్ ఇచ్చాడు బిగ్ బాస్. ఆ బేస్మెంట్ దగ్గరకి గడియారం ముళ్లు వస్తుంది. దాన్ని బట్టీ ఆ టైమింగ్ కి జంప్ చేయాల్సి ఉంటుంది. ఇందులో హౌస్మెట్స్ అందరూ చాలా పట్టుదలగా ఆడారు. అయితే, ఈ టాస్క్ లో అర్జున్ గెలిచినట్లుగా సమాచారం తెలుస్తోంది. అర్జున్ ఆ టాస్క్ ని ఫినిష్ చేసి 100 పాయింట్స్ సంపాదించాడు.

ఈ టాస్క్ తర్వాత కూడా ఫ్లవర్ డిజైన్ టాస్క్ పెట్టాడు బిగ్ బాస్. ఫ్లవర్ డిజైన్ టాస్క్ లో భాగంగా యాక్టివిటీ ఏరియాలో పూలని తీస్కుని వచ్చి గార్డెన్ ఏరియాలో అమర్చాల్సి ఉంటుంది. ఈ టాస్క్ లో పల్లవి ప్రశాంత్ గెలిచి 100 పాయింట్స్ ని కైవసం చేసుకున్నాడు. ఇక్కడే హౌస్ మేట్స్ మద్యలో వాదన కూడా జరిగింది. ఇక మూడో టాస్క్ ఏం ఇస్తాడు అనేది ఆసక్తికరంగా మారింది. నిజానికి ఈ టిక్కెట్ టు ఫినాలే టాస్క్ పెట్టినప్పుడల్లా గొడవలు పీక్స్ లో ఉంటాయ్.

ఇంతకాలం కలిసి మెలిసి గేమ్ ఆడిన పార్టిసిపెంట్స్ అందరూ ఒక్కసారిగా బరెస్ట్ అవుతారు. గత సీజన్స్ లో ఈ టాస్క్ చాలామంది మద్యలో లొల్లి పెట్టింది. గత సీజన్స్ లో చూసినట్లయితే, టిక్కెట్ టు ఫినాలే టాస్క్ సీజన్ 1 లో ఆదర్శ్, సీజన్ 2 లో సామ్రాట్, సీజన్ 3లో రాహుల్, సీజన్ 4 లో అఖిల్, సీజన్ 5లో శ్రీరామ్, సీజన్ 6లో శ్రీహాన్, గెలుచుకున్నారు. కానీ, వీళ్లో కేవలం రాహుల్ సిప్లిగంజ్ మాత్రమే విన్నర్ గా నిలిచాడు ఇది మనందరికీ తెలిసిందే.

ఇప్పుడు మరి ఈ టాస్క్ లలో ఎవరు బాగా ఆడి పాయింట్స్ సాధించి ఫైనల్ గా పోటీ పడతారు అనేది చూడాలి. టాప్ 2లో ఉన్న ఇద్దరికీ ఖచ్చితంగా ఒక టాస్క్ పెడతాడు బిగ్ బాస్. ఈ టాస్క్ లో గెలిచివాళ్లు మాత్రమే ఫినాలేలోకి అడుగుపెడతారు. ఈసారి ఈ ఫినాలే టిక్కెట్ కోసం ఎనిమిది మంది పోటీ పడటం అనేది గమనార్హం. మరి వీళ్లలో ఎవరు గెలుచుకుంటారు అనేది (Bigg Boss 7 Telugu) ఈవారం టాస్క్ లు అయ్యాక తెలుస్తుంది. అదీ మేటర్.

ఆదికేశవ్ సినిమా రివ్యూ & రేటింగ్!

కోట బొమ్మాళీ పి.ఎస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సౌండ్ పార్టీ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus