Janhvi Kapoor: పాపం జాన్వీ కపూర్ కి ఎంత కష్టమొచ్చిందో అంటున్న నెటిజన్లు!

దివంగత మహానటి శ్రీదేవి గారి కూతురుగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన జాన్వీ కపూర్ కి ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. కేవలం శ్రీదేవి కూతురుగా ఈమెకి క్రేజ్ రాలేదు, ఈమె అందం కి అందరూ ఫిదా అవ్వబట్టే క్రేజ్ వచ్చింది. మరో విశేషం ఏమిటంటే ఈమె ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి 5 ఏళ్ళు అవుతుంది. ఇప్పటి వరకు ఈమె కెరీర్ లో ఒక్క సక్సెస్ కూడా లేదు. అయిన కానీ ఈమెకి ఇంత డిమాండ్ మరియు క్రేజ్ ఉంది అంటే, ఆమెలో ఉన్న స్పెషాలిటీ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు.

ఇన్ని రోజులు కేవలం బాలీవుడ్ లోనే సినిమాలు చేస్తూ వచ్చిన జాన్వీ కపూర్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ‘దేవర’ చిత్రం తో టాలీవుడ్ లోకి కూడా ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతున్న సంగతి అందరికీ తెలిసిందే. త్వరలో జాన్వీ కపూర్ కి సంబంధించిన భారీ షెడ్యూల్ ప్రారంభం కాబోతుంది అట. దీనికి ఆమె ప్రాక్టీస్ చెయ్యాల్సిన అవసరం చాలా ఉంది.

ఎందుకంటే కథలో అత్యంత కీలకమైన యాక్షన్ సన్నివేశాలు ఇవి. పగలు పూట బాలీవుడ్ లో ఒక సినిమా షూటింగ్ లో బిజీ గా ఉంటున్న జాన్వీ కపూర్, దేవర రిహార్సల్స్ లో కచ్చితంగా పాల్గొనే అవసరం ఉండడం తో ప్రతీ రోజు రాత్రి హైదరాబాద్ కి వచ్చి, ప్రత్యేకమైన రిహార్సల్స్ చేసి, మళ్ళీ వేరే మూవీ షూటింగ్ కి బయలుదేరుతుంది అట.

ఈ రిహార్సల్స్ ఒక్కోసారి తెల్లవారుజామున వరకు కూడా కొనసాగిన సందర్భాలు ఉన్నాయట. అలా ఆమె గత వారం రోజుల నుండి కొరటాల శివ కి ఇచ్చిన కమిట్మెంట్ కోసం నిద్రలేని రాత్రులు గడుపుతుంది. ఆమె చూపిస్తున్న ఈ డెడికేషన్ కి సోషల్ మీడియా లో నెటిజెన్స్ నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆమె కష్టానికి తగిన ఫలితం దేవర చిత్రం ఇస్తుందో లేదో చూడాలి.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus