Mahesh Babu, Trivikram: మహేష్ త్రివిక్రమ్ మూవీ గురించి షాకింగ్ న్యూస్ వైరల్!

మహేష్ త్రివిక్రమ్ కాంబో మూవీ షూటింగ్ ఈ నెలలోనే మొదలుకానున్న సంగతి తెలిసిందే. కొన్ని నెలల క్రితమే ఈ సినిమా షూట్ మొదలు కావాల్సి ఉన్నా స్క్రిప్ట్ వర్క్ ఆలస్యం కావడంతో ఈ సినిమా షూటింగ్ ఆలస్యమైందని సమాచారం అందుతోంది. ఈ సినిమాలో మహేష్ బాబు నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించనున్నారని సమాచారం అందుతోంది. అయితే నెగిటివ్ షేడ్స్ లో మహేష్ కనిపించడానికి బలమైన కారణం ఉంటుందని ఊహలకు అందని విధంగా త్రివిక్రమ్ మహేష్ పాత్రను డిజైన్ చేశారని బోగట్టా.

క్లైమాక్స్ లో మహేష్ నెగిటివ్ గా బిహేవ్ చేయడానికి గల కారణాన్ని త్రివిక్రమ్ చూపిస్తారని తెలుస్తోంది. మహేష్ బాబును త్రివిక్రమ్ సినిమాలో కొత్తగా ప్రేక్షకులు చూడబోతున్నారని బోగట్టా. త్రివిక్రమ్ కథ విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారని సమాచారం అందుతోంది. విజయ్ సేతుపతి లేదా ఉపేంద్ర ఈ సినిమాలో విలన్ రోల్ లో కనిపించే ఛాన్స్ అయితే ఉందని ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా వినిపిస్తోంది. మహేష్ త్రివిక్రమ్ కాంబో మూవీ వచ్చే ఏడాది సమ్మర్ లో థియేటర్లలో విడుదల కానుందని సమాచారం అందుతోంది.

త్రివిక్రమ్ వేగంగానే ఈ సినిమా షూటింగ్ ను పూర్తి చేయాలని భావిస్తున్నారని బోగట్టా. అల వైకుంఠపురములో సినిమా తర్వాత ఎంతో సమయం కేటాయించి త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ సినిమా స్క్రిప్ట్ ను సిద్ధం చేశారు. మహేష్ బాబు ఈ సినిమా విషయంలో ఎంతో కాన్ఫిడెన్స్ తో ఉన్నారు. హారిక హాసిని క్రియేషన్స్ నిర్మాతలు ఖర్చు విషయంలో రాజీ పడకుండా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాతో మహేష్ ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ చేరడం ఖాయమనే కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

ఈ సినిమా షూటింగ్ ను పూర్తి చేసి మహేష్ జక్కన్న మూవీతో బిజీ కానున్నారు. మహేష్ బాబు తర్వాత ప్రాజెక్ట్ లపై కూడా మంచి అంచనాలు నెలకొన్నాయి. జక్కన్న సినిమాతో మహేష్ పాన్ ఇండియా హీరోగా గుర్తింపును సొంతం చేసుకునే ఛాన్స్ అయితే ఉందని చెప్పవచ్చు.

రామారావు ఆన్ డ్యూటీ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అసలు ఎవరీ శరవణన్.. ? ‘ది లెజెండ్’ హీరో గురించి ఆసక్తికర 10 విషయాలు..!
ఈ 10 మంది దర్శకులు ఇంకా ప్లాపు మొహం చూడలేదు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus