టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ మధ్యనే ‘గుంటూరు కారం’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమాకి ఎలాంటి టాక్ వచ్చింది అనే విషయాన్ని పక్కన పెట్టేస్తే… వసూళ్ల పరంగా రూ.100 కోట్ల షేర్ మూవీ అయిపోయింది ‘గుంటూరు కారం’. మహేష్ కి ఇది వరసగా 5వ రూ.100 కోట్ల షేర్ మూవీ కావడం విశేషంగా చెప్పుకోవాలి. టాలీవుడ్ స్టార్ హీరోల్లో ప్రభాస్ కి తప్ప మరో హీరోకి ఇలాంటి రికార్డు లేదు. ఇప్పుడు ఆ రికార్డును మహేష్ బాబు సొంతం చేసుకున్నాడు.
మరోపక్క ‘గుంటూరు కారం’ లో మహేష్ బాబు పెర్ఫార్మన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ” ‘ఖలేజా’ సినిమాలో చేసిన పెర్ఫార్మన్స్ మళ్ళీ మహేష్ చేయలేడేమో?’ అనే కామెంట్లు చాలా వినిపించాయి. ‘గుంటూరు కారం’ లో అంతకు మించే మహేష్ పెర్ఫార్మ్ చేశాడు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ముఖ్యంగా డాన్సుల విషయంలో మహేష్ పై చాలా కంప్లైంట్స్ ఉన్నాయి. కానీ ‘గుంటూరు కారం’ లో మహేష్ బాబు చేసిన డాన్సులు గతంలో ఏ సినిమాలోనూ చేయలేదు.
అంతా బానే ఉంది కానీ ‘గుంటూరు కారం’ తర్వాత మహేష్ రాజమౌళి (Rajamouli) దర్శకత్వంలో సినిమా చేయబోతున్నాడు. రాజమౌళితో సినిమా అంటే చిన్న వ్యవహారం కాదు. రెండేళ్ల పాటు మహేష్ ఆ సినిమాపైనే ఉండాలి. ప్రస్తుతం మహేష్ బాబు వయసు 48 ఏళ్లు. రాజమౌళి సినిమా కంప్లీట్ అయ్యేసరికి అతను 50 ఏళ్ళు పూర్తిచేసుకుంటాడు. ఆ తర్వాతి సినిమాకి ఎలా అనుకున్నా 2 ఏళ్ళ టైం పడుతుంది. సో 50 ఏళ్ళ వయసులో ‘గుంటూరు కారం’ లో చేసిన డాన్సులు ..
ఇంకో సినిమాలో మహేష్ బాబు చేయడం చాలా కష్టం. ఇంకో రకంగా అసాధ్యమనే చెప్పాలి. ప్రభాస్ నే ఉదాహరణగా తీసుకుంటే ‘డార్లింగ్’ ‘మిర్చి’ సినిమాల వరకు డాన్సులు బాగానే చేశాడు. కానీ ‘బాహుబలి’ తర్వాత ఒక్క సినిమాలో కూడా డాన్స్ విషయంలో ప్రభాస్ ఫ్యాన్స్ ని ఆకట్టుకోలేకపోయాడు. 44 ఏళ్ళ టైంలోనే ప్రభాస్ పరిస్థితి ఇలా ఉంటే.. 50 ఏళ్లకు మహేష్ బాబు పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.
గుంటూరు కారం సినిమా రివ్యూ & రేటింగ్!
హను మాన్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గుంటూరు కారం’ తో పాటు 24 గంటల్లో రికార్డులు కొల్లగొట్టిన 15 ట్రైలర్ల లిస్ట్..!