Mahesh Babu, Rajamouli: మహేష్ జక్కన్న మూవీ స్క్రిప్ట్ పనులు పూర్తి కాలేదా..?

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్ లో కేఎల్ నారాయణ నిర్మాతగా ఒక సినిమా తెరకెక్కాల్సి ఉంది. ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమా పనులతో బిజీగా ఉన్న రాజమౌళి ఈ సినిమా షూటింగ్ పూర్తైన వెంటనే మహేష్ బాబు సినిమాకు సంబంధించిన పనులను మొదలుపెట్టనున్నారు. రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ పనులతో బిజీగా ఉన్నారని తెలుస్తోంది.

అయితే కొన్ని నెలల క్రితం మహేష్ రాజమౌళి మూవీ ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కనుందని ఒక వార్త వైరల్ కాగా రాజమౌళి సినిమాలో మహేష్ ఛత్రపతి శివాజీ రోల్ లో కనిపిస్తారని మరో వార్త ప్రచారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. అయితే తెలుస్తున్న సమాచారం ప్రకారం ఈ వార్తల్లో నిజం లేదని సమాచారం. మహేష్ రాజమౌళి కాంబో మూవీ నిర్మాత కేఎల్ నారాయణ తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ సినిమాకు సంబంధించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

మహేష్ రాజమౌళి కాంబినేషన్ మూవీకి సంబంధించి వైరల్ అవుతున్న వార్తలు ఫేక్ వార్తలని కేఎల్ నారాయణ అన్నారు. ఆ సినిమా సబ్జెక్ట్, షూటింగ్ కు సంబంధించిన విషయాలు తనకే తెలియవని ఆయన వెల్లడించారు. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతోందని మహేష్ రాజమౌళి కాంబినేషన్ లో సినిమా తెరకెక్కించడం తన డ్రీమ్ అని ఆయన తెలిపారు. ఏడు సంవత్సరాల క్రితం మహేష్ రాజమౌళి కాంబినేషన్ గురించి చర్చ జరిగిందని అప్పటికీ ఇప్పటికీ ఈ సినిమా రేంజ్ మారిందని మహేష్, రాజమౌళి తనతో సినిమా చేస్తున్నామని ప్రకటన చేసినందుకు వాళ్లకు రుణపడి ఉంటానని ఆయన వెల్లడించారు.

Most Recommended Video

ఈ 10 మంది టాప్ డైరెక్టర్లు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాళ్ళే..!
2 ఏళ్ళుగా ఈ 10 మంది డైరెక్టర్ల నుండీ సినిమాలు రాలేదట..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus