Chiranjeevi: చినిగిన చొక్కాతో తాళికట్టిన మెగాస్టార్ .. బయటపడ్డ షాకింగ్ నిజాలు..!

ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ సపోర్టు లేకుండా ఇండస్ట్రీ లోకి వచ్చి పైకి ఎదుగుతున్న రోజుల్లో చిరంజీవి గొప్ప వాడు అవుతాడు అని గుర్తించిన మొట్టమొదటి వ్యక్తి అల్లు రామలింగయ్య. కుర్రాడు చాలా వినయం గా ఉన్నాడు, చెడు అలవాట్లు కూడా లేనట్టు ఉన్నాయ్, పెద్దవాళ్ళు అంటే గౌరవం, ఇలాంటి లక్షణాలన్నీ గమనించిన తర్వాత చిరంజీవి కి తన కూతురుని ఇచ్చి పెళ్లి చేసాడు అల్లు రామలింగయ్య. ఆ తర్వాత కొడుకు అల్లు అరవింద్ చిరంజీవి ని పెట్టి వరుసగా సినిమాలు తీసి బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టి టాలీవుడ్ లోనే అగ్ర నిర్మాతగా ఎదిగిపోయాడు.

చిరంజీవి (Chiranjeevi) కూడా ఇండస్ట్రీ లో అగ్ర హీరో గా స్థిరపడి, నెంబర్ 1 హీరోగా, మెగాస్టార్ గా సుమారు నాలుగు దశాబ్దాల పాటు కొనసాగాడు. ఇదంతా పక్కన పెడితే సీనియర్ నటుడు నూతన ప్రసాద్ వల్ల మెగాస్టార్ చిరంజీవి పెళ్లి రద్దు అయ్యే దాకా వెళ్ళింది అనే విషయం ఎవరికైనా తెలుసా..? అసలు విషయం లోకి వెళ్తే ఆరోజుల్లో నూతన ప్రసాద్ ఇండస్ట్రీ లో మంచి బిజీ గా ఉన్నటువంటి ఆర్టిస్ట్. స్టార్ హీరోలతో సరిసమానంగా రెమ్యూనరేషన్స్ తీసుకునేవాడు.

ఆయన డేట్స్ కోసం నిర్మాతలు యుద్ధం చేసేవారు. అప్పట్లో చిరంజీవి ‘తాతయ్య ప్రేమలీలలు’ అనే చిత్రం చేసాడు. ఇందులో నూతన ప్రసాద్ తో చిరంజీవి కి పలు ముఖ్యమైన సన్నివేశాలు ఉన్నాయి. నిర్మాత సరిగ్గా చిరంజీవి పెళ్లి రోజే షూటింగ్ ని పెట్టుకున్నాడు. అల్లు అరవింద్ చొరవ చేసుకొని షూటింగ్ డేట్ ని వాయిదా వెయ్యమని కోరగా , నిర్మాత నూతన ప్రసాద్ డేట్స్ ఈరోజు మిస్ అయితే మళ్ళీ నెల రోజులు వరకు దొరకవు , నాకు చాలా నష్టం అవ్వుధి, చిరంజీవి ని వదలడం కుదరదు అని చెప్పాడట.

దీంతో పెళ్లిని రద్దు చేసి వేరే డేట్ కి వాయిదా వెయ్యిద్దామా ? అనే ఆలోచనలో పడ్డారట. అయితే నిర్మాత పెళ్లి మండపం కి తగ్గర్లోనె షూటింగ్ పెట్టుకోవడం తో చిరంజీవి షూటింగ్ ని పూర్తి చేసుకొని వెంటనే పెళ్లి మండపం కి వచ్చేసాడు. అక్కడికి వచ్చినప్పుడు ఆయన వేసుకున్న చొక్కా మోచెయ్యి దగ్గర చినిగిపోయి ఉంది. ఆ చినిగిన చొక్కా తోనే పెళ్లి చేసుకున్నాడట చిరంజీవి.

గాండీవదారి అర్జున సినిమా రివ్యూ & రేటింగ్!

బెదురులంక 2012 సినిమా రివ్యూ & రేటింగ్!
కింగ్ ఆఫ్ కొత్త సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus