మెగాస్టార్ చిరంజీవి హీరోగా వచ్చిన ‘గ్యాంగ్ లీడర్’ చిత్రం ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. విజయ్ బాపినీడు డైరెక్షన్లో వచ్చిన ఈ చిత్రాన్ని ‘శ్యాం ప్రసాద్ ఆర్ట్స్’ బ్యానర్ పై మాగంటి రవీంద్ర నాధ్ చౌదరి నిర్మించారు.1991 మే 9న ఈ చిత్రం విడుదల అయ్యింది. అయితే ఈ చిత్రం కథ మొదట విన్నప్పుడు మెగాస్టార్ చెయ్యను అనేసారట. ఇప్పుడు మనం చూస్తన్న ‘గ్యాంగ్ లీడర్’ అసలు కథ వేరట.
విజయ్ బాపినీడు ముందు వినిపించిన కథ ప్రకారం … హీరో పెద్దన్నయ్యతో పాటు అతని స్నేహితులు కూడా ఒకేసారి చనిపోతారట. అయితే ఈ కథని చిరుకి అత్యంత సన్నిహితులు అయిన పరిచూరి బ్రదర్స్ .. విజయ్ బాపినీడు వద్ద కథ విని… కొన్ని మార్పులు చేస్తే ఈ కథ అద్బుతంగా ఉంటుంది అని చెప్పారట.3 రోజులు వారు ఈ కథ పై కసరత్తులు చేసి… హీరో పెద్దన్నయ్యతో పాటు తన నలుగురు స్నేహితులు వెంటనే చనిపోతే ఏం బాగుంటుంది…
ఆ గ్యాంగ్ ఉంటేనే ‘గ్యాంగ్ లీడర్’ టైటిల్ కు జస్టిఫికేషన్ ఉంటుంది అని.. అలాగే క్లయిమాక్స్ లో వచ్చే విజయ్ శాంతి ట్విస్ట్ ను కూడా వారు జోడించినట్టు తెలుతుంది. ఇలా మార్చిన కథను చిరుకి చెప్పడం ఆయన ఓకే చెయ్యడం జరిగిందట. ఈ చిత్రంలో ‘చెయ్యి చూసావా ఎంత రఫ్ గా ఉందో.. రఫ్ఫాడించేస్తా ఏమనుకున్నావో’ అనే డైలాగ్ ఎంతో ఫేమస్ అయ్యింది.
Most Recommended Video
అతి తక్కువ వయసులో లోకం విడిచిన తారలు
అత్యధిక ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన తెలుగు సినిమాలు…!
‘మహానటి’ లోని మనం చూడని సావిత్రి, కీర్తి సురేష్ ల ఫోటోలు…!