సినీ ప్రపంచంలో తమకంటూ ప్రత్యేక ముద్ర వేసుకున్న హీరో హీరోయిన్లు జయలలిత. అయితే ఇమె సినిమాలు వదలి రాజకీయంలోకి వెళ్లిన సంగతి తెలిసిందే.. జయలలిత తొలిసారి ముఖ్యమంత్రి అయిన సందర్భంలో ఓ సంఘటన జరిగింది ఇప్పుడు ఆ సంఘటన వైరల్ గా మారింది. అన్నా డీఎంకే వ్యవస్థాపక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని అప్పటి ముఖ్యమంత్రి అయిన జయలలిత నిర్ణయం తీసుకుంది. ఈ సందర్భంగా పార్టీ వ్యవస్థాపకుడు, ప్రముఖ హీరో ఎంజీఆర్ కు ఘన నివాళి అర్పించిన పార్టీ అధినేతలు.. కీలక నిర్ణయం తీసుకున్నారు.
అయితే అసెంబ్లీ ఆవరణలో ఎంజీఆర్ చిత్రపటాన్ని పెట్టాలని సూచించారు. వాస్తవానికి ఆయన మాజీ సీఎం కూడా కావడంతో ఇది సబబేనని అందరూ అన్నారు. కానీ, ఇంతలో మాజీ సీఎంల విషయానికి వస్తే.. కాంగ్రెస్ తరఫున పనిచేసిన వారి ఫొటోలు కూడా అసెంబ్లీ ఆవరనలో పెట్టాల్సి ఉంటుందని, కాబట్టి మాజీ సీఎం హోదాలో కాదు.. రాష్ట్ర తమిళ సినీ పరిశ్రమకు చేసిన సేవకు గుర్తుగా ఆయన ఫొటోను పెట్టాలని మరో తీర్మానం తెరమీదికివచ్చింది. దీనికి జయలలిత కూడా ఓకేచెప్పారు. ఇక, ఈ విషయం తెలిసిన డీఎంకే అప్పటి మహానటి సావిత్రి ఫొటోను కూడా పెట్టాలని పట్టుబట్టింది.
సినిమా తారల ఫొటోలు అసెంబ్లీలో పెట్టే కొత్త సంప్రదాయానికి సీఎం శ్రీకారం చుట్టారు. ఇది నిజమైన సంప్రదాయమే అయితే.. వివక్ష, పక్షపాతం లేకపోతే.. ఎంజీఆర్ ఫొటోతో పాటు.. సావిత్రమ్మ ఫొటో కూడా పెట్టాల్సిందే అని అప్పటి డీఎంకే అధినేత, మాజీ సీఎం కరుణానిధి నిప్పులు చెరిగారు. ఎందుకంటే.. సావిత్రమ్మ ఫొటో పెట్టేందుకు సీఎంగా జయలలిత ఎలానూ ఒప్పుకోదు. ఈ విషయం ఆయనకు తెలుసు. సో.. ఈ వ్యూహంతో నాడు ఫొటోలు పెట్టే సంస్కృతిని అడ్డుకున్నారు.
ఇక, కరుణానిధి వ్యాఖ్యలను తిప్పికొట్టిన (Jayalalitha) జయలలిత.. ఇది సాధ్యం కాదని.. అసెంబ్లీలో దేశాధినేతల ఫొటోలు మాత్రమే ఉండాలని తీర్మానం చేసి.. దానినే అమలు చేశారు. మొత్తానికి కరుణానిధి ప్లే చేసిన సావిత్రి ఫొటో వ్యవహారం.. కోలీవుడ్‌ను సైతం కుదిపేసింది. దీనిని సమర్ధిస్తూ.. ఒకవర్గం.. వ్యతిరేకిస్తూ.. మరో వర్గం ప్రచారం చేశాయి. ఎట్టకేలకు అసలుఫొటోలే పెట్టొద్దని నిర్ణయించడంతో వివాదం సర్దుబణిగింది.
మంగళవారం సినిమా రివ్యూ & రేటింగ్!
స్పార్క్ సినిమా రివ్యూ & రేటింగ్!
సప్త సాగరాలు దాటి సైడ్ బి సినిమా రివ్యూ & రేటింగ్!