Nagarjuna: నాగార్జున బ్లాక్ బస్టర్ సినిమా వెనుక ఇంత కథ నడిచిందా?

టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన నాగార్జున మాస్ సినిమాలతో పాటు క్లాస్ సినిమాలతో సైతం భారీ స్థాయిలో విజయాలను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. నాగ్ సినీ కెరీర్ లోని బ్లాక్ బస్టర్ సినిమాలలో నిన్నే పెళ్లాడతా ఒకటి కాగా ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. గులాబీ మూవీ సక్సెస్ తర్వాత కృష్ణవంశీ నాగార్జునతో ఒక యాక్షన్ మూవీ ప్లాన్ చేయాలని అనుకున్నారు. రామ్ గోపాల్ వర్మ శిష్యుడైన కృష్ణవంశీ గులాబీ సినిమాతో సాధించిన సక్సెస్ తో నాగార్జున సినిమాకు పని చేసే అవకాశం దక్కింది.

కృష్ణవంశీ మాస్, యాక్షన్ స్టోరీని నాగ్ కు వినిపించగా ఆ కథ నాగార్జునకు ఎంతగానో నచ్చింది. కథ విన్న వెంటనే నాగార్జున నుంచి సినిమాకు సంబంధించి గ్రీన్ సిగ్నల్ లభించింది. ఆ సినిమా కోసం లొకేషన్లను చూడటానికి కృష్ణవంశీ వైజాగ్ కు వెళ్లారు. అయితే అదే సమయంలో ఒక వ్యక్తి కృష్ణవంశీతో మాట్లాడుతున్న సమయంలో ఆ వ్యక్తి మీ గురువు రామ్ గోపాల్ వర్మలా బాగా తీశారని చెప్పుకొచ్చారు. అయితే కృష్ణవంశీ మాత్రం వర్మ ముద్ర తనపై ఉండటం కెరీర్ పరంగా మంచిది కాదని భావించారు.

ఆ తర్వాత (Nagarjuna) నాగార్జునకు ఫోన్ చేసిన కృష్ణవంశీ గతంలో చెప్పిన కథతో నేను సినిమా చేయడం లేదని కొత్త కథతో తీస్తానని చెప్పగా నీకు పిచ్చి పట్టలేదు కదా అంటూ నాగ్ బదులిచ్చారట. అదేం లేదు.. రేపు మిమ్మల్ని వచ్చి కలుస్తాం అని కృష్ణవంశీ ఫోన్ పెట్టేసి ఆ తర్వాత నిన్నే పెళ్లాడతా సినిమాను తెరకెక్కించారు.

నాగ్ కృష్ణవంశీ కాంబినేషన్ లో తెరకెక్కిన నిన్నే పెళ్లాడతా కలెక్షన్ల విషయంలో సరికొత్త రికార్డులను క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. నాగ్ ప్రస్తుతం పలు క్రేజీ ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్నారు. నాగ్ తర్వాత సినిమాలతో భారీ విజయాలను సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

అశ్విన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!

ఆ హీరోయిన్లలా ఫిట్ నెస్ కంటిన్యూ చేయాలంటే కష్టమే?
తన 16 ఏళ్ళ కెరీర్లో కాజల్ రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus