Ravi Teja, Krishna Vamsi: కృష్ణవంశీ, రవితేజ… ఇద్దరికీ అక్కడే చెడిందా?

క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ, మాస్ మహారాజ్ రవితేజ.. ఇద్దరూ ఆర్జీవీ స్కూలే. కెరీర్ ప్రారంభంలో ఇద్దరూ రాంగోపాల్ వర్మ వద్ద అసిస్టెంట్లుగా పనిచేసేవారు. మంచి స్నేహితులు కూడా. కృష్ణవంశీ డైరెక్ట్ చేసిన ‘నిన్నే పెళ్ళాడతా’ ‘సముద్రం’ ‘ఖడ్గం’ వంటి సినిమాల్లో రవితేజ నటించాడు. వీటిలో ‘ఖడ్గం’ పెద్ద హిట్ అయ్యింది. అలాగే ‘సింధూరం’ సినిమాలో రవితేజ చంటి అనే పాత్ర పోషించాడు. అలాంటి హుషారైన పాత్రనే ‘ఇడియట్’ లో రవితేజతో చేయించాడు దర్శకుడు పూరీ జగన్నాథ్.

Ravi Teja, Krishna Vamsi

అది రవితేజ కెరీర్ కి టర్నింగ్ పాయింట్ అయ్యింది. తర్వాత ‘ఖడ్గం’ లో రవితేజ చేసిన పాత్రకు కూడా మంచి అప్రిసియేషన్ దక్కింది. కానీ ఆ తర్వాత ఈ కాంబినేషన్లో సినిమా రాలేదు. దర్శకుడు కృష్ణవంశీ ఇమేజ్ కూడా అప్పుడు డౌన్ అవుతూ వచ్చింది. ఈ విషయాలు పక్కన పెట్టేస్తే.. సినిమా రాకపోయినా పర్వాలేదు. కృష్ణవంశీ కూడా ఫామ్లో లేకపోవడంతో రవితేజ సినిమా చేస్తాడని చెప్పలేం. కాబట్టి.. వాళ్ళ కాంబోలో సినిమా కోసం ఆడియన్స్ ఆశించలేదు.

అయితే దాదాపు పుష్కర కాలం తర్వాత.. కృష్ణవంశీ పాల్గొన్న కొన్ని ఇంటర్వ్యూల్లో రవితేజ గురించి ప్రశ్న ఎదురైతే చాలు.. వాటిని స్కిప్ చేయడం మొదలుపెట్టాడు. ఒకటి, రెండు ఇంటర్వ్యూల్లో అయితే పర్వాలేదు.. దాదాపు కృష్ణవంశీ పాల్గొన్న ప్రతి ఇంటర్వ్యూలో కూడా రవితేజ టాపిక్ రాగానే కృష్ణవంశీ అసహనం వ్యక్తం చేయడం జరిగింది. ‘అతని గురించి టాపిక్ వద్దు’ అంటూ కృష్ణవంశీ పలకడం జరిగింది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో రవితేజ మాట్లాడుతూ.. ” ‘నిన్నే పెళ్ళాడతా’ లో నటించడం ఇష్టం లేదు.

చేయకపోతే ‘సింధూరం’ నుండి నన్ను కృష్ణవంశీ తీసేస్తాడేమో అనే భయంతో చేశాను” అంటూ చెప్పాడు. ఆ తర్వాత ‘అర్హత లేని వాళ్లకి, రికమండేషన్ బ్యాచ్ కి మంచి మంచి పాత్రలు ఇచ్చేవారు’ అంటూ కూడా రవితేజ పలకడం జరిగింది. అంటే అతని కామెంట్స్ ను బట్టి.. ‘ఖడ్గం’ సినిమాలో శ్రీకాంత్ కి ఎక్కువ ప్రాధాన్యత ఉన్న పాత్ర ఇవ్వడంపై రవితేజ హర్ట్ అయ్యి కృష్ణవంశీని ఇగ్నోర్ చేయడం మొదలు పెట్టి ఉండవచ్చు అని కొందరు భావిస్తున్నారు.

25 ఏళ్ళ ‘నువ్వేకావాలి’.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే..!

 

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus