Sai Pallavi: తెలుగు నిర్మాతలతో ఎక్స్ట్రా ఖర్చులు పెట్టిస్తున్న సాయి పల్లవి..ఏమైందంటే!

సాయి పల్లవి టాలీవుడ్లో ఉన్న స్టార్ హీరోయిన్లలో ఒకరు. ఓ రకంగా వాళ్ళందరి కంటే సాయి పల్లవికి క్రేజ్ ఎక్కువ అని చెప్పినా అతిశయోక్తి అనిపించుకోదు. మహేష్ బాబుతో సహా ప్రతి స్టార్ హీరో సాయి పల్లవితో కలిసి నటించాలని అనుకుంటారు అనడంలో కూడా సందేహం లేదు. ఎందుకంటే ఆమె బెస్ట్ యాక్టర్ కాబట్టి. అలా అని శ్రీలీల..లా క్యాష్ చేసుకోవాలనే ఆలోచన ఈమెకి ఉండదు.సెలక్టివ్ గానే సినిమాలు చేస్తూ వస్తోంది. ఆమె ఓ సినిమాకి సైన్ చేసే ముందు ఒకటికి రెండు సార్లు అన్ని విషయాలు పరిశీలించుకుని కానీ సైన్ చేయదు.

అయితే ‘లవ్ స్టోరీ’ నుండి కనుక గమనిస్తే (Sai Pallavi) సాయి పల్లవి సెలెక్ట్ చేసుకుని చేస్తున్న సినిమాల్లో ఓ కామన్ పాయింట్ కనిపిస్తుంది. అదేంటంటే.. సాయి పల్లవి ఓ సినిమాని ఎంపిక చేసుకోవాలి అంటే.. ఆ సినిమాలో పాత్ర ప్రత్యేకంగా ఉండాలి. అంతేకాదు తన పాత్రకి తగ్గట్టు ఎంతో వర్క్ షాప్ చేయాలని ఆమె భావిస్తుంది. ఉదాహరణకి ‘ఫిదా’ ‘లవ్ స్టోరీ’..ల సంగతి చూద్దాం. ఆ రెండు సినిమాల్లో ఆమె తెలంగాణ యాసలో మాట్లాడింది. అందుకోసం ఆమె స్పెషల్ ట్రైనర్ ను పెట్టుకుని మరీ ఆ స్లాంగ్ నేర్చుకోవడం జరిగింది.

తర్వాత ‘విరాటపర్వం’ లో నక్సలైట్ రోల్ కోసం ఆమె ఆర్మీ ఆఫీసర్స్ హయాంలో గన్ షూటింగ్ ట్రైనింగ్ తీసుకుంది. ‘శ్యామ్ సింగ రాయ్’ లో తన పాత్ర కోసం కూడా కొన్ని రోజుల పాటు ప్రత్యేకంగా వర్కౌట్ చేసింది. ఇక ఆమె నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘తండేల్’ లో ఆమె ఓ మత్స్యకారుడు భార్య పాత్ర కోసం ఆమె నెల రోజుల పై నుండి వర్క్ షాప్ చేస్తుందట. ఈ సినిమా షూటింగ్ ప్రధానంగా శ్రీకాకుళం, గుజరాత్ పరిసర ప్రాంతాల్లో జరుగుతుందట. శ్రీకాకుళంకి చెందిన ఓ మత్స్యకారుడిగా నాగ చైతన్య కనిపిస్తారు.

శ్రీకాకుళం స్లాంగ్ లో అతను మాట్లాడతారు. అందుకోసం ట్రైనర్ ను కూడా పెట్టుకున్నారు. సాయి పల్లవి కూడా ఆ స్లాంగ్ లో డబ్బింగ్ చెప్పుకోడానికి, అక్కడి జనాలకి తగ్గట్టు హావభావాలు పలికించడానికి వర్క్ షాప్ చేసినట్లు సమాచారం.ఆమె చేసే వర్క్ షాప్..ల కోసం నిర్మాతలు ఎక్స్ట్రా గా డబ్బులు పెట్టాల్సిందే. సాయి పల్లవి ఎక్కువ పారితోషికం డిమాండ్ చేసే వ్యక్తి కాదు..పర్ఫెక్షన్ కోసం ఆమె ఇలా కష్టపడుతుంది కాబట్టి నిర్మాతలు హ్యాపీగానే డబ్బులు ఎక్స్ట్రాగా ఖర్చు చేస్తారు అని స్పష్టమవుతుంది.

హాయ్ నాన్న సినిమా రివ్యూ & రేటింగ్!!

‘ఎక్స్ట్రా ఆర్డినరీ మెన్’ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ లో దాగున్న టాలెంట్స్ ఏంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus