Shanmukh: దీప్తి సునైనా కంటే ముందే షణ్ముఖ్ ఆ అమ్మాయి ప్రేమించాడా..!

యూట్యూబ్ లో షార్ట్ ఫిలిమ్స్ ద్వారా మంచి క్రేజ్ మరియు ఫ్యాన్ ఫాలోయింగ్ ని దక్కించుకున్న వారిలో ఒకరు షణ్ముఖ్ జస్వంత్. ఇతను హీరో గా నటించిన ‘సాఫ్ట్ వేర్ డెవలపర్’, ‘సూర్య’ మరియు రీసెంట్ గా ‘స్టూడెంట్’ వెబ్ సిరీస్ లు మంచి హిట్ అయ్యాయి. ముఖ్యంగా పైన చెప్పిన రెండు సిరీస్ లు యూత్ లో ఆయనకీ మంచి క్రేజ్ ని ఏర్పాటు చెయ్యడం తో బిగ్ బాస్ హౌస్ లో ఒక కంటెస్టెంట్ గా అడుగుపెట్టే ఛాన్స్ దొరికింది.

సీజన్ 4 లో ఒక కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చిన షణ్ముఖ్ రన్నర్ గా మిగిలాడు. అయితే ఈయన బిగ్ బాస్ హౌస్ లో సిరి తో చేసిన రొమాన్స్ పెద్ద సెన్సేషనల్ టాపిక్ అయ్యింది. ఈ రొమాన్స్ కారణంగా షణ్ముఖ్ కి ఆయన ప్రేయసి దీప్తి సునైనా బ్రేకప్ కూడా చెప్పేసింది. అయితే రీసెంట్ గా షణ్ముఖ్ జస్వంత్ గురించి మరో హాట్ న్యూస్ తెలిసింది. అదేమిటంటే ఈయన దీప్తి సునైనా కంటే ముందుగా నయని పావనీ తో ప్రేమాయణం నడిపాడట.

నయని పావనీ తో కలిసి ఆయన రెండు మూడు కవర్ సాంగ్స్ కూడా చేసాడు. రీసెంట్ గానే ఈమె బిగ్ బాస్ హౌస్ లోకి వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా అడుగుపెట్టి, ఒక్క వారం లోనే ఎలిమినేట్ అయిన సంగతి అందరికీ తెలిసిందే. ఈమె ఎలిమినేషన్ చాలా బాధకి గురి చేసింది. అయితే ఈమె చేతి మీద ‘SJ’ అనే టాటూ ఉండడాన్ని నెటిజెన్స్ గమనించారు. ఈ టాటూ షణ్ముఖ్ జస్వంత్ తో ప్రేమలో ఉన్నప్పుడు పావనీ వేసుకుంది.

‘S’ అంటే (Shanmukh) షణ్ముఖ్, ‘J’ అంటే జస్వంత్ అన్నమాట. అయితే కొన్ని అనుకోని కారణాల వల్ల వీళ్లిద్దరు విడిపోవాల్సి వచ్చిందట. విడిపోయిన తర్వాత యూట్యూబ్ లో వీళ్ళు కలిసి చేసిన కవర్ సాంగ్స్ ని కూడా తొలగించారు. కానీ పావనీ ఇంకా ఆ టాటూ ని తన చేతి మీదనే ఉంచుకోవడం చూస్తుంటే ఆమె షన్ను ని ఇంకా మర్చిపోలేదా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

‘బిగ్ బాస్ 7’ వైల్డ్ కార్డ్ ఎంట్రీ నయనీ పావని గురించి 10 ఆసక్తికర విషయాలు!

‘పుష్ప’ టు ‘దేవర’.. 2 పార్టులుగా రాబోతున్న 10 సినిమాలు..!
‘బిగ్ బాస్ 7’ వైల్డ్ కార్డ్ ఎంట్రీ అశ్విని శ్రీ గురించి 10 ఆసక్తికర విషయాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus