వరుణ్ – లావణ్య కంటే ముందే ఆ మెగా హీరో ప్రేమాయణం..!

లావణ్య త్రిపాఠి, మెగా హీరో వరుణ్ తేజ్…ల ఎంగేజ్మెంట్ రెండు రోజుల క్రితం అంటే జూన్ 9న రాత్రి హైదరాబాద్, మణికొండ లో ఉన్న నాగబాబు ఇంట్లో ఘనంగా జరిగింది. కొద్దిపాటి బంధుమిత్రుల.. సమక్షంలో వీరి ఎంగేజ్మెంట్ ఎంగేజ్మెంట్ ను నిర్వహించారు. వారం రోజులుగా వీరి ఎంగేజ్మెంట్ గురించే సోషల్ మీడియాలో ఎక్కువ చర్చ జరుగుతూ వస్తోంది. అందుకు సంబంధించిన ఫోటోలు కూడా వైరల్ అయ్యాయి. అయితే వీరి పెళ్లి డేట్ ఇంకా ఫిక్స్ కాలేదు.

ఇదిలా ఉండగా.. వరుణ్ తేజ్ – లావణ్య ల కంటే ముందు సాయి ధరమ్ తేజ్ – రెజీనా ల గురించి ఎక్కువ వార్తలు వచ్చేవి. వీళ్ళు పెళ్లి చేసుకుంటారనే చర్చ కూడా జరిగింది. సాయి ధరమ్ తేజ్, రెజీనా కాంబినేషన్లో ‘పిల్లా నువ్వు లేని జీవితం’ ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’ వంటి సినిమాలు వచ్చాయి. అవి రెండు మంచి విజయాలను అందుకున్నాయి. ఈ సినిమాల టైంలో తేజు – రెజీనా బాగా క్లోజ్ అయ్యారు. ఈ క్రమంలో వీరు డేటింగ్ చేస్తున్నారు అనే చర్చ కూడా గట్టిగానే జరిగింది.

కానీ అలాంటిది ఏమీ లేదని.. మేము మంచి స్నేహితులం అంటూ వీళ్ళు ఆ వార్తలకి ఫుల్ స్టాప్ పెట్టారు. అయినప్పటికీ వీళ్ళు ప్రైవేట్ గా కలిసిన సందర్భాలు చాలానే ఉన్నాయి. కానీ ఫోటోలు బయటకు రాకుండా జాగ్రత్త పడ్డారు అనే టాక్ ఉంది. ఓ సందర్భంలో ‘కొందరి అత్యుత్సాహం వల్ల నేను కొందరితో స్నేహం వదులుకోవాల్సి వచ్చింది’ అంటూ తేజు ఎమోషనల్ కామెంట్ చేశాడు. సో రెజీనా- తేజులకి బ్రేకప్ అయ్యిందని ఆ టైంలో అంతా అనుకున్నారు.

టక్కర్ సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రేక్షకులను థియేటర్ కు రప్పించిన సినిమాలు ఇవే..!

అత్యధికంగా రెమ్యునరేషన్ తీసుకుంటున్న మ్యూజిక్ డైరెక్టర్లు వీళ్లేనా..!/a>
కలెక్షన్లలో దూసుకుపోతున్న లేడీ ఓరియంటల్ సినిమాలు ఇవే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus