NTR, Janhvi Kapoor: ఇదెక్కడి ట్విస్ట్ దేవర.. నెటిజన్ల కామెంట్స్ హాట్ టాపిక్ అయ్యాయిగా!

ఎన్టీఆర్ జాన్వీ కపూర్ కాంబినేషన్ లో 300 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తం బడ్జెట్ తో తెరకెక్కుతున్న దేవర సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమా రిలీజ్ కు ఆరు నెలల సమయం ఉండగా దేవర సినిమాకు సంబంధించి వస్తున్న అప్ డేట్స్ ఈ సినిమాపై అంచనాలను పెంచాయి. దేవర సినిమా రెండు భాగాలుగా తెరకెక్కుతుందని ప్రచారం జరుగుతుండగా ఈ ప్రచారంలో నిజానిజాలు తెలియాల్సి ఉంది.

బాలకృష్ణ శ్రీదేవి కాంబినేషన్ లో ఒక సినిమా కూడా తెరకెక్కలేదనే సంగతి తెలిసిందే. సీనియర్ ఎన్టీఆర్ కు జోడీగా నటించిన శ్రీదేవి తనకు తల్లిలాంటిదని బాలయ్య పలు సందర్భాల్లో వెల్లడించగా బాలయ్య అలా చెప్పడంతో జూనియర్ ఎన్టీఆర్ కు శ్రీదేవి నాన్నమ్మ అవుతుందని నాన్నమ్మ కూతురు జాన్వీ కపూర్ జూనియర్ ఎన్టీఆర్ కు అత్త అవుతుందని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.

కొంతమంది ట్విట్టర్ యూజర్లు సోషల్ మీడియాలో ఇందుకు సంబంధించి పోస్ట్ లు పెడుతుండగా ఆ పోస్ట్ లు హాట్ టాపిక్ అవుతున్నాయి. అయితే ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాత్రం ఈ కామెంట్లను సరదాగా తీసుకుంటున్నారు. దేవర సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్న నేపథ్యంలో ఈ సినిమా ఆ అంచనాలను అందుకుంటుందో లేదో చూడాల్సి ఉందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

దేవర సినిమాలో యాక్షన్ సీక్వెన్స్ లు సైతం నెక్స్ట్ లెవెల్ లో ఉండనున్నాయని తెలుస్తోంది. హిందీలో సైతం రికార్డ్ స్థాయి థియేటర్లలో ఈ సినిమా రిలీజ్ అవుతుండటం గమనార్హం. దేవర పార్ట్1 ను మించి దేవర పార్ట్2 ఉండనుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. వచ్చే ఏడాది నందమూరి ఫ్యాన్స్ కు పండగలా ఉండనుందని సమాచారం అందుతోంది. ఎన్టీఆర్ సినిమాలు ఏ రేంజ్ లో రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి. (NTR) ఎన్టీఆర్, జాన్వీ కాంబినేషన్ లో మరిన్ని సినిమాలు రావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

గత 10 సినిమాల నుండి రామ్ బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ శుభ శ్రీ గురించి ఈ 14 విషయాలు మీకు తెలుసా?
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ టేస్టీ తేజ గురించి 10 ఆసక్తికర విషయాలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus