Bigg Boss 7 Telugu: ఫినాలే అస్త్ర టాస్క్ లో ట్విస్ట్ ఏంటి ? ప్రియాంక వెళ్తు వెళ్తు ఏం చేసిందంటే.?

బిగ్ బాస్ హౌస్ లో ఫినాలే అస్త్రా టాస్క్ నడుస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఇప్పటి వరకూ మూడు టాస్క్ లు అయ్యాయి. రెండు టాస్క్ ల తర్వాత పాయింట్స్ టేబుల్ లో లీస్ట్ లో ఉన్న శోభా ఇంకా శివాజీ ఇద్దరూ కూడా ఫినాలే రేస్ నుంచీ తప్పుకున్నారు. మిగిలిన ఆరుగురు మూడో టాస్క్ లో పోటీ పడగా ఈ టాస్క్ లో ప్రియాంక లీస్ట్ వచ్చింది. అందుకే జీరో పాయింట్స్ మాత్రమే వచ్చాయ్. ఇక ఆ తర్వాత బిగ్ బాస్ పడవ టాస్క్ పెట్టాడు. పడవలో ఇసుకని మరోవైపు పోస్తూ వారి పడవ పై నుండా జెండా పైకి వచ్చేలా చేయాలి.

ఎత్తరజెండా అంటూ ఈ టాస్క్ ఆడిన పార్టిసిపెంట్స్ పోటా పోటీగా తలపడ్డారు. ఇక్కడే గౌతమ్ మరోవైపు పడవలో ఉన్న ఇసుకని ఇటుసైడ్ పోస్తూ స్ట్రాటజీ వర్కౌట్ చేయాలని చూశాడు. దీంతో సంచాలక్ గా ఉన్న శోభాశెట్టి ఇది నేను కన్సిడర్ చేయను అని చెప్పి స్ట్రిక్ట్ గా మాట్లాడింది. దీంతో చేసేది లేక మళ్లీ ఆటని ప్రారంభించాడు. ఇక ఈ టాస్క్ లో అందరికంటే ముందుగా జెండాని ఎగరేసి పల్లవి ప్రశాంత్ 100 పాయింట్స్ సాధించినట్లుగా సమాచారం తెలుస్తోంది. ఈ టాస్క్ తో మొత్తం నాలుగు టాస్క్ లు పూర్తి అయ్యాయి.

ఈ టాస్క్ పూర్తి అవ్వగానే పాయింట్స్ టేబుల్ లో లీస్ట్ లో ఉన్న ప్రియాంక రేస్ నుంచీ తప్పుకోవాల్సి వచ్చింది. ఇక మిగిలిన ఐదుగురిలో కూడా కొన్ని టాస్క్ లు పెట్టాడు బిగ్ బాస్. సౌండ్ గెస్సింగ్ టాస్క్ లో అర్జున్ మరోసారి విజయం సాధించి 100 పాయింట్స్ కైవసం చేసుకున్నాడు. ఆ తర్వాత క్రికెట్ స్కోర్స్ పైన రింగ్స్ వేయడంలో అమర్ దీప్ చాకచక్యం చూపించి మరీ గెలిచాడు. దీంతో పవర్ అస్త్ర ఫినాలే టాస్క్ లో గౌతమ్ ఇంకా యావర్ కూడా తప్పుకోవాల్సి వచ్చింది. ఇక అర్జున్ – అమర్ – పల్లవి ప్రశాంత్ ఈ ముగ్గురులోనే ఫినాలే టిక్కెట్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఒకవేళ ఫినాలే టిక్కెట్ వచ్చినా కూడా ఈవారం సేఫ్ అవ్వాల్సి ఉంటుంది. అలా అయితేనే గ్రాండ్ పినాలేలోకి వెళ్తారు. లేదంటే మాత్రం ఈవారం ఎలిమినేషన్ ఉంటుంది. అర్జున్ – పల్లవి ప్రశాంత్ ఇంకా అమర్ దీప్ ఈ ముగ్గురూ లీడింగ్ స్కోర్స్ లో ఉన్నారు. దీంతో పాటుగా అమర్ దీప్ శోభా-శివాజీ ఇద్దరూ ఇచ్చిన పాయింట్స్ అనేది ప్లస్ అయ్యాయి. అందుకే అమర్ దీప్ – అర్జున్ మద్యలోనే ఫినాలే టిక్కెట్ రేస్ ఉండచ్చని తెలుస్తోంది. మరి వీళ్లలో ఎవరు (Bigg Boss 7 Telugu) ఫినాలే టిక్కెట్ ని సొంతం చేస్కుంటారు అనేది ఆసక్తికరంగా మారింది. అదీ మేటర్.

ఆదికేశవ్ సినిమా రివ్యూ & రేటింగ్!

కోట బొమ్మాళీ పి.ఎస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సౌండ్ పార్టీ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus