Devara2: దేవర2 మూవీ గురించి షాకింగ్ అప్డేట్.. అన్నేళ్లు ఆగాలా?

ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న దేవర సినిమా రిలీజ్ డేట్ గురించి క్లారిటీ రావడంతో గేమ్ ఛేంజర్ సినిమాతో పాటు ఇతర సినిమాల రిలీజ్ డేట్ల గురించి త్వరలో క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది. అయితే దేవర2 సినిమా కోసం ఎదురుచూస్తున్న ఫ్యాన్స్ కు భారీ షాక్ తగిలింది. ఎన్టీఆర్ ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సినిమాలను పూర్తి చేసిన తర్వాతే దేవర2 సినిమాపై దృష్టి పెట్టనున్నారని తెలుస్తోంది.

దేవర1 విడుదలైన తర్వాత వార్2 సినిమా షూట్ లో తారక్ పాల్గొననున్నారని భోగట్టా. వార్2 సినిమా పూర్తైన తర్వాత ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబో మూవీ సెట్స్ పైకి వెళ్లనుందని తెలుస్తోంది. ఈ సినిమాలన్నీ పూర్తైన తర్వాత దేవర2 సినిమాపై తారక్ దృష్టి పెట్టనున్నారని భోగట్టా. దేవర2 (Devara2) సినిమా కోసం మరో మూడు నుంచి నాలుగు సంవత్సరాలు ఆగాల్సి ఉంటుందని తెలుస్తోంది.

జూనియర్ ఎన్టీఆర్ వరుసగా సినిమాలలో నటిస్తుండగా వేర్వేరు కారణాల వల్ల తారక్ సినిమాలు వాయిదా పడుతున్నాయి. జూనియర్ ఎన్టీఆర్ యాక్షన్ సీన్స్ ఉన్న సినిమాలకు, అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించే సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. కొన్ని కారణాల వల్ల బుచ్చిబాబు సినిమాను రిజెక్ట్ చేసిన ఎన్టీఆర్ బాలీవుడ్ ఇండస్ట్రీలో సైతం క్రేజ్ పెరిగే దిశగా అడుగులు వేస్తున్నారు.

ఆర్.ఆర్.ఆర్ సక్సెస్ తో తారక్ కు అన్ని భాషల్లో మంచి గుర్తింపు దక్కింది. ఆ గుర్తింపు మరింత పెరిగేలా తారక్ ప్రాజెక్ట్ ల ఎంపిక ఉందని తెలుస్తోంది. రెమ్యునరేషన్ కు బదులుగా తారక్ లాభాల్లో వాటా తీసుకుంటున్నారు. జూనియర్ ఎన్టీఆర్ మైండ్ బ్లాంక్ అయ్యే కాన్సెప్ట్ లను ఎంచుకుంటున్నారని తెలుస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ సినిమాలలో మెజారిటీ సినిమాలు ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ లో తెరకెక్కుతున్నాయి. తారక్ కెరీర్ ప్లాన్స్ వేరే లెవెల్ లో ఉన్నాయి.

ఊరిపేరు భైరవ కోన సినిమా రివ్యూ & రేటింగ్!

‘దయా గాడి దండయాత్ర’ కి 9 ఏళ్ళు!
ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్..ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus