Indian2: వామ్మో.. శంకర్ కాన్ఫిడెన్స్ మామూలుగా లేదుగా!

శంకర్ డైరెక్షన్ లో కమల్ హాసన్ హీరోగా తెరకెక్కుతున్న ఇండియన్2 సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా కచ్చితంగా సక్సెస్ సాధించాల్సి ఉంది. కమల్ హాసన్ కంటే దర్శకుడు శంకర్ కు ఈ సినిమా సక్సెస్ కీలకం కానుందని చెప్పవచ్చు. శంకర్ ఖాతాలో ఈ మధ్య కాలంలో సరైన సక్సెస్ లేకపోవడంతో ఈ సినిమాతో శంకర్ కోరుకున్న సక్సెస్ దక్కే ఛాన్స్ అయితే ఉందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

అయితే తెలుస్తున్న సమాచారం ప్రకారం ఈ సినిమా హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో రిలీజ్ కానుంది. ఈ సినిమాలోని ఒక సన్నివేశంలో పది నిమిషాల డైలాగ్ ఉంటుందని ఆ డైలాగ్ ను కమల్ హాసన్ కట్ లేకుండా చెప్పారని సమాచారం అందుతోంది. అయితే కమల్ హాసన్ 14 భాషలు కలిసి ఉన్న డైలాగ్ ను చెప్పారని సమాచారం అందుతోంది. ఇండియన్2 సినిమాకు ఈ డైలాగ్ హైలెట్ గా నిలుస్తుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

10 నిమిషాల డైలాగ్ ను చెప్పడమే కష్టం అంటే ఏకంగా 14 భాషల్లో ఉన్న డైలాగ్ ను చెప్పడం అంటే అది కమల్ హాసన్ టాలెంట్ అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. కమల్ హాసన్ తన ప్రతిభతో ప్రశంసలు అందుకుంటున్నారు. ఈ అరుదైన రికార్డ్ కమల్ కు మాత్రమే సొంతమని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. భారతీయుడు సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి.

ఇండియన్2 సినిమాలో కాజల్ హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాల్సి ఉంది. శంకర్ ఈ సినిమా రిజల్ట్ విషయంలో కాన్ఫిడెన్స్ తో ఉన్నారు. ఈ సినిమా ఆయన నమ్మకాన్ని నిజం చేస్తుందో లేదో చూడాల్సి ఉంది. ఒక్కో సినిమాకు శంకర్ 40 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని తెలుస్తోంది.

బిగ్ బాస్ 6 తెలుగు 21 మంది కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!

Most Recommended Video

భూమా మౌనిక కు ఆల్రెడీ పెళ్లయిందా?
బిగ్ బాస్ కంటెస్టెంట్ రేవంత్ గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఛార్మి మాత్రమే కాదు నిర్మాతలయ్యి భారీగా నష్టపోయిన హీరోయిన్ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus